ఎడ్యుకేషనల్ హబ్ గా గజ్వేల్.

సిద్ధిపేట:
దేశానికే ఆదర్శంగా నిర్మిస్తున్న ‘గజ్వేల్ ఎడ్యుకేషన్ హబ్’ నిర్మాణ పనులు తొందరగా పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామ రెడ్డి అధికారులను ఆదేశించారు. సిద్ధిపేట జిల్లా గజ్వేల్ లోని ఎడ్యుకేషనల్ హబ్ లో మంగళవారం మధ్యాహ్నం ‘గడ’ ప్రత్యేక అధికారి హన్మంతరావు, హౌసింగ్ శాఖ ఈఈ అనిల్, డీఈ రామచంద్రుడు, వివిధ శాఖాధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎడ్యుకేషనల్ హబ్ ను ప్రారంభించనున్నారని., ఈ విషయమై మిగులు పనుల్లో వేగం పెంచాలని సూచించారు. ఎడ్యుకేషన్ హబ్ పరిసర ప్రాంతాలలో గ్రీనరీ చేపట్టేలా కేటాయించిన ఏజెన్సీ ప్రతినిధులు, ఫారెస్ట్, హౌసింగ్ అధికారుల సమన్వయంతో పక్కా ప్రణాళికలతో హబ్ ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని సూచనలు చేశారు.

దక్షిణ భారత దేశంలోనే క్లీన్ సిటీగా సిద్ధిపేట పట్టణం నిలువడం తెలంగాణ రాష్ట్రానికే గర్వ కారణమని జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామ రెడ్డి అన్నారు. సిద్ధిపేట కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఉదయం మున్సిపల్ ఛైర్మెన్ రాజనర్సు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి కలెక్టర్ కు పుష్ఫగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అదే విధంగా ఆర్ డబ్ల్యూఎస్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మిషన్ భగీరథలో ఎక్సలెన్స్ అవార్డు పొందిన సందర్భంగా జిల్లా కలెక్టర్ కు పుష్పగుచ్ఛం ఇచ్చి శాలువాతో ఘనంగా సన్మానించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఆర్వో వెంకట నారాయణ, ఆర్ ఐ క్రిష్ణలు ఉన్నారు.