ఎన్టీఆర్ బయోపిక్ పై రెండు కేసులు.

హైదరాబాద్:
నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎన్టీఆర్‌ బయోపిక్‌పై మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సినిమా విషయంలో తమను ఎవరూ సంప్రదించలేదని, తమ పాత్రలను నెగిటివ్‌గా చూపించే ప్రయత్నం జరుగుతోందంటూ నోటీసులు పంపారు. ఎమ్మెల్యే హోదాలో ఒకటి, నటుడి హోదాలో ఒకటి.. మొత్తం రెండు నోటీసులను బాలకృష్ణకు పంపగా, దర్శకుడు క్రిష్‌కు మరో నోటీసు పంపారు. సినిమాలో తమ పాత్రల విషయంలో ఎవరూ తమ నుంచి అనుమతులు తీసుకోలేదని, సినిమా నిర్మాణాన్ని ఆపాల్సిందిగా అందులో పేర్కొన్నారు.