ఎన్ ఆర్ ఐ జయరాం హత్యపై ఛార్జిషీటు! క్రైమ్,సస్పెన్స్, థ్రిల్లింగ్ సినిమాను మరిపిస్తున్న జయరాం కేసు!!

Hyderabad;

ఎన్ ఆర్ ఐ జయరాం హత్యపై పోలీసులు ఛార్జిషీటు దాఖలు చేశారు.23 పేజీల ఛార్జిషీటు ధాఖలు చేసిన పోలీసులు.ఛార్జిషీటులో మొత్తం 12 మంది నిందితులు ఉన్నారు. ముగ్గురు పోలీస్ అధికారులు కూడా ఉన్నారు.రాకేష్ ప్రధమ ముద్దాయి.విశాల్, శ్రీనివాస్ (వాచ్ మాన్), నగేష్ (రౌడీషీటర్), సూర్య ప్రసాద్ (కమేడియన్), కిషోర్ (సూర్య ప్రసాద్ స్నేహితుడు), సుభాష్ రెడ్డి (రియల్ ఎస్టేట్ వ్యాపారి),బిఎన్ రెడ్డి (టిడిపి నాయకుడు), అంజిరెడ్డి (రియల్ ఎస్టేట్ వ్యాపారి) శ్రీనివాసులు (నల్లకుంట మాజీ ఇన్స్పెక్టర్), రాంబాబు (రాయదుర్గం మాజీ ఇన్స్పెక్టర్) మల్లారెడ్డి (ఇబ్రహీంపట్నం మాజీ ఏసిపి) లను ఛార్జి షీటులో నమోదు చేశారు.ఈ కేసులో 73 మంది సాక్షులను విచారించారు.11వ సాక్షిగా శ్రిఖా చౌదరి,13 సాక్షిగా శ్రిఖా బాయ్ ఫ్రెండ్ సంతోష్ రావ్ ఉన్నారు.హనీ ట్రాప్ తో జయరాం హత్యకు కుట్ర పన్నిన రాకేష్ రెడ్డి.పిడిగుద్దులు గుద్ది మొహం పై దిండుతో అదిమి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేసిన రాకేష్ రెడ్డి.
పోలీసుల సూచనతోనే మృతదేహం నందిగామకు తరలించిన రాకేష్ రెడ్డి.
జయరాంను చిత్రహింసలు పెట్టి చంపిన రాకేష్ రెడ్డి.మొత్తం వీడియోలో చిత్రీకరించిన నిందితుడు.11 వీడియోలు, 13 ఫొటోలు తీసిన నిందితులు.”హాస్పటల్ కు తీసుకు వెళ్ళు రాకేష్ ప్లీజ్ రాకేష్” అంటూ ప్రాధేయపడ్డ
జయరాం.”ప్రతినెలా 50 లక్షలు ఇస్తా డాక్యుమెంట్సు మీ దగ్గరే ఉంది.. పాస్ పోర్టు
మీదగ్గరే పెట్టకుని ప్రాణాలతో వదిలెయ్” మని బ్రతిమలాడిన జయరాం.వీణ పేరుతో లంచ్ కు ఆహ్వానించిన రాకేష్.జయరాం శరీరంలో ఎటువంటి విషపదార్దాలు లేవని పేర్కొన్న పోస్టుమార్టం రిపోర్ట్.టెట్రాన్ కంపెనీ వివాదం పరిష్కరిస్తానని జయరాంకు పరిచయమైన రాకేష్.అదే సమయంలో శ్రిఖా తో రాకేష్ రెడ్డికి పరిచయం.సహజీవనం చేసిన శ్రిఖా, రాకేష్ రెడ్డి.
జంటగా విదేశాల్లో జల్సాలు చేశారు.శ్రిఖా చౌదరిని పెళ్ళి చేసుకోవాలనుకున్న రాకేష్ రెడ్డి.
పెళ్ళి వాయిదా వేస్తూ వచ్చిన శ్రిఖా చౌదరి.
శ్రిఖా చౌదరి జల్సాల కోసం కోట్లు ఖర్చుపెట్టిన రాకేష్.రాకేష్ తో సహజీవనం చేస్తూనే సాగర్ అనే వ్యక్తితో యూరప్ వెళ్ళిన శ్రిఖా
చౌదరి.సాగర్ తో అఫైర్ పెట్టుకున్న శ్రిఖా చౌదరి.
సాగర్ తో అఫైర్ పై శ్రిఖా చౌదరి ని నిలదీసిన రాకేష్ రెడ్డి.ఖర్చు చేసిన డబ్బు వెనక్కు ఇవ్వాలంటూ డిమాండ్.శ్రిఖా చౌదరి బిఎమ్ డబ్ల్యూ కారు ఎత్తకెళ్ళేందుకు ప్రయత్నించిన రాకేష్ రెడ్డి.శ్రిఖా చౌదరి పై ఖర్చు చేసిన డబ్బు తాను చెల్లిస్తానని హామీ ఇచ్చిన
జయరాం.రాకేష్ రెడ్డి ఫోన్ లకు సమాధానమివ్వని జయరాం.ఇచ్చిన మాట తప్పడంతో జయరాంను కిడ్నాప్ చెయ్యాలని స్కెచ్ వేసిన రాకేష్ రెడ్డి.జయరాం రీకపోకలపై సమాచారం ఇవ్వాలని శ్రిఖా చౌదరి వాచ్ మెన్ కు డబ్బు ఇచ్చిన రాకేష్.జనవరి 29 న శ్రిఖా చౌదరి ఇంటి వద్ద నుంచి జయరాం కిడ్నాప్ కు
ప్రయత్నించిన రాకేష్ రెడ్డి.తృటిలో తప్పించుకున్న జయరాం.కిడ్నాప్ స్కెచ్ విఫలమయ్యాక రాయదుర్గం సిఐ రాంబాబును కలిసిన రాకేష్ రెడ్డి.7893270759 నంబరు నుంచి వీణ అనే పేరుతో జయరాంకు మెసేజ్
“లంచ్ కి కలుద్దాం” అంటూ హనీట్రాప్!!
వీణ డ్రైవర్లమంటూ జయరాం ను రాకేష్ ఇంటికి తీసుకు వెళ్ళిన కమేడియన్
సూర్యప్రసాద్ , కిషోర్.జయరాం సెల్ ఫోన్లు లాక్కున్న రాకేష్.డబ్బులిస్తేనే వదిలి పెడతానన్న రాకేష్ రెడ్డిడబ్బుల కోసం పలువురికి ఫోన్లు చేసిన జయరాం.రూ.6 లక్షలు సర్దుబాటు చేసిన ఈశ్వరరావు.దస్ పల్లా హోటల్ లో రాకేష్ అనుచరుడికి డబ్బులు ఇచ్చిన ఈశ్వరరావు.
ఇప్పటికిప్పుడు 50 లక్షలు కావల్సిందేనన్న రాకేష్ రెడ్డి.ఖాళీ స్టాంప్ పేపర్లపై జయరాం సంతకాలు తీసుకున్న రాకేష్ రెడ్డి.ఛాతిలో నోప్పిగా ఉందని హాస్పటల్ కు తీసుకు వెళ్ళాలని కోరిన జయరాం.
4.5 కోట్లు జయరాంకు అప్పు ఇచ్చినట్లు రాయించుకున్న రాకేష్ రెడ్డి.టిడిపి నేత బిఎన్ రెడ్డి సమక్షంలో అగ్రిమెంట్.సంతకాలు తీసుకుని జయరాంను హత్య చెయ్యమని నగేష్ ను ఆదేశించిన రాకేష్ రెడ్డి.హత్యకు సహకరించిన నగేష్ బంధువు విశాల్.హత్య చేసిన విషయాన్ని రాయదుర్గం మాజీ సిఐ రాంబాబుకు ఫోన్ లో
చెప్పిన రాకేష్ రెడ్డి.కారులో మృతదేహంలో నల్లకుంట పోలీస్ స్టేషన్ కు వెళ్ళిన రాకేష్ రెడ్డి.
మాజీ సిఐ శ్రీనివాసులుతో కలిసి మాట్లాడిన రాకేష్.పోలీసుల సలహాతో మృతదేహం ఏపికి తరలింపు.