ఎన్ కౌంటర్ లతో పెరుగుతున్న మావోయిస్టుల ప్రాబల్యం. – వరవరరావు.

హైదరాబాద్:
ఛత్తీస్ ఘడ్ సుక్మా జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ ముమ్మాటికీ బూటకపు ఎన్ కౌంటర్ అని విప్లవరచయిత వరవరరావు మంగళవారం ఆరోపించారు. దీనిపై సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.కార్పొరేట్ శక్తులకు దాసోహం అయి ఏక పక్షంగా కాల్పులు జరిపారని ఆయన తెలిపారు. భద్రత బలగాలు అరెస్ట్ చేసిన ఐదుగురు మావోయిస్టులను వెంటనే కోర్టులో హాజరు పరచాలని వరవరరావు కోరారు.
చనిపోయిన15 మంది మావోయిస్టుల మృతదేహలను వారి కుటుంబాలకు అప్పగించాలని కోరారు. ఎన్ కౌంటర్ల వలన మావోయిస్టుల ప్రాబల్యం తగ్గకపోగా ఇంకా పెరుగుతున్నట్టు వరవరరావు అభిప్రాయ పడ్డారు. సుప్రీంకోర్టు తీర్పులను ఉల్లంగిస్తూ కాల్పులు జరిపారని ఆయన ఆక్షేపించారు. సమగ్ర న్యాయ విచారణ జరిపి దోషులను శిక్షించాలని వి.వి.డిమాండ్ చేశారు.