బీసీలకు పెద్ద దిక్కుగా వున్న ఎర్రశేఖర్నుతీసుకువచ్చేందుకుప్రయత్నాలుజరుగుతున్నవి. ఎర్రశేఖర్ మాత్రం తాను సైకిల్‌ను వీడేది లేదంటున్నారు. అయితే తన అన్న మాజీ మంత్రి పొడపాటిచంద్రశేఖర్ఇప్పటికే కాంగ్రెస్‌లో ఉన్నారు. ఆయనకు జైపాల్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇటు జిల్లాలో అటు రాష్ట్రంలో, కేంద్రంలో చక్రం తిప్పే జైపాల్ రెడ్డి మదిలోఏముందోనన్నదిపలువురురాజకీయనాయకులను వేధిస్తోంది. ఇక ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్‌ను ఎదుర్కొనేసత్తా స్టామినా ఒక్క ఎర్రశేఖర్కుమాత్రమేఉందని కాంగ్రెస్ ఆలోచిస్తున్నది.
ప్రభాకర్, మహబూబ్ నగర్;
పాలమూరు జిల్లో రాజకీయ సమీకరణాలు రాకెట్ కంటే వేగంగా మారిపోతున్నాయి. ప్రతి సారి జరిగేఎన్నికల్లోతెలంగాణలోప్రత్యేకించిమహబూబ్నగర్శాసనసభానియోజకవర్గంప్రధానపార్టీలకుఅగ్నిపరీక్షనుకలుగ చేస్తూ వస్తోంది. జిల్లాలో ముందు నుంచి తెలుగుదేశం పార్టీకి గ్రామ స్థాయి నుండి మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయి వరకు మంచి పట్టుంది. టీడీపీప్రభుత్వహయాంలోఇక్కడి నుండి మంత్రులుగా పలువురు ప్రాతినిధ్యం వహించారు. ఆనాటి మంత్రివర్గంలో నీతి నిజాయితీకి మారుపేరుగా పి. మహేంద్రనాథ్ పేరు తెచ్చుకున్నారు. సంక్షేమ వసతిగృహాలను ఏర్పాటు చేయడంలో, రెవిన్యూ వ్యవస్థనుగాడినపెట్టడంలోఆయన ఎంతో పేరు తెచ్చుకున్నారు. ఎన్టీఆర్ కు నమ్మదగినవ్యక్తుల్లోఒకరుగా పేరు తెచ్చుకున్నారు. పొడపాటిచంద్రశేఖర్, నాగం జనార్దన్ రెడ్డి, రావుల చంద్రశేఖర్ రెడ్డి, తదితరులు పార్టీకి పట్టుకొమ్మలుగావుంటూవచ్చారు. ఈ జిల్లాలో బహుజనులకుఅండదండలు అందిస్తూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దివంగతఎర్రసత్యంతనహవానడిపించారు. అప్పుడు ఆయన ఏం చెబితే అదే వేదంగా టీడీపీలోనడిచింది. ఆయనతదనంతరంసోదరుడుఎర్రశేఖర్జడ్చర్లనియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతోఒక్కసారిగారాజకీయాలలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. సైకిల్‌కు పట్టు వున్న చోట్లో కూడా హస్తంతనఆధిపత్యాన్నిప్రదర్శించింది. అయినా ఎర్రశేఖర్జడ్చర్ల ఎమ్మెల్యేగా గెలుపొందడం అటు వైఎస్ ఆర్‌ను కూడా ఆలోచించేలా చేసింది. బీసీల జనాభాఎక్కువగాఉండడంతోఎర్రశేఖర్కు తిరుగు లేకుండా పోయింది. అయితే వ్యక్తిగతంగాహైదరాబాద్లోనేఉండడం, తెలంగాణ ఉద్యమప్రభావంతోఎర్రశేఖర్జడ్చర్లను కోల్పోయారు. ప్రస్తుతంఎన్నికలుజరిగేందుకు ఇంకా 9నెలలసమయంఉన్నప్పటికీపాలమూరు వ్యాప్తంగా ఎర్రశేఖర్ గురించే చర్చజరుగుతోంది.
పార్లమెంట్లోబీజేపీసర్కార్పైటీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం, అది వీగి పోవడంజరిగినా అనూహ్యంగా 147సీట్లతో మోడీ, షాలకు కోలుకోలేని షాక్ ఇచ్చారు. గతఎన్నికల్లోకమలంతోటీడీపీ దోస్తీ నాలుగేళ్లపాటుకొనసాగింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంతోటీడీపీ, బీజేపీలమధ్య ఉన్న మైత్రీబంధానికి గండి పడింది. దీంతో బాబు చేపట్టిన ఈ తీర్మానానికి ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ బేషరత్గామద్ధతుఇవ్వడంతోఊహించని రీతిలో దేశ వ్యాప్తంగా రాజకీయసమీకరణాలు మారిపోయాయి. ఇదే విషయమై రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా సరే అటు తెలంగాణాలో ఇటు ఏపీతో పాటు దక్షిణాదిలో తిరిగి కోల్పోయిన ప్రాబవాన్ని, పవర్నుతెచ్చుకోవాలనే ఉద్ధేశంతో కాంగ్రెస్ చకాచకా పావులు కదుపుతోంది. జగమెరిగిన మేధావి, బెస్ట్ పార్లమెంటేరియన్ గా పేరు తెచ్చుకున్న సూదిని జైపాల్ రెడ్డికి ఇటీవల ఆ పార్టీ జాతీయ అధికార పార్టీ ప్రతినిధిగానియమించడంప్రాధాన్యతనుసంతరించుకుంది. పాలమూరు జిల్లాలో ఎలాగైనా సరేవచ్చేఎన్నికల్లోటీఆర్ ఎస్ కు చెక్ పెట్టేందుకు వచ్చినప్రతిఅవకాశాన్ని కాంగ్రెస్ వినియోగించుకుంటోంది. టీడీపీలోనెంబర్2 గా వున్న సీనియర్‌నాయకులు, మాజీ మంత్రి డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డిని పార్టీలోకి చేర్చుకుంది. అసెంబ్లీ టైగర్ గా పేరున్న ఎనుములరేవంత్ రెడ్డిని ఆహ్వానించింది. ఇంకో వైపు జేజమ్మగా పేరున్న డి.కె.అరుణ ఎంత వద్దన్నా అధిష్టానం మాత్రం గెలుపు గుర్రాలు ఎవరైనాసరే..ఏ పార్టీలో ఉన్నా సరే వారిని ఆకర్షించేందుకు పావులు కదుపుతోంది. ఈ నేపధ్యంలో సైకిల్, హస్తం రానున్న ఎన్నికల్లోకలిసేఅవకాశమేఎక్కువగా వుంది. దీంతో జిల్లాలో ఆయా పార్టీలన్నీ బీసీలు, బహుజనులు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలనుప్రసన్నం చేసుకునేందుకు అష్టకష్టాలుపడుతున్నాయి. ఈ సమయంలో బీసీలకు పెద్ద దిక్కుగా వున్న ఎర్రశేఖర్నుతీసుకువచ్చేందుకుప్రయత్నాలుజరుగుతున్నవి. ఎర్రశేఖర్ మాత్రం తాను సైకిల్‌ను వీడేది లేదంటున్నారు. అయితే తన అన్న మాజీ మంత్రి పొడపాటిచంద్రశేఖర్ఇప్పటికే కాంగ్రెస్‌లో ఉన్నారు. ఆయనకు జైపాల్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇటు జిల్లాలో అటు రాష్ట్రంలో, కేంద్రంలో చక్రం తిప్పే జైపాల్ రెడ్డి మదిలోఏముందోనన్నదిపలువురురాజకీయనాయకులను వేధిస్తోంది. ఇక ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్‌ను ఎదుర్కొనేసత్తా స్టామినా ఒక్క ఎర్రశేఖర్కుమాత్రమేఉందని కాంగ్రెస్ ఆలోచిస్తున్నది. దాదాపు 60వేలకు మించి ముదిరాజ్కులస్తుల ఓట్లు ఉండడంఎర్రశేఖర్కుప్లస్ పాయింట్. మొత్తం మీద అన్ని పార్టీలు టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీసీ నేత ఎర్రశేఖర్పైనే దృష్టి కేంద్రీకరించాయి.