ఎల్లుండి బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా.


హైదరాబాద్:
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా ఎల్లుండి విడుదల కానుంది. ఈ జాబితాలో 30 మంది అభ్యర్థులు ఉండే అవకాశాలున్నవి. రాష్ట్ర స్థాయి ఎన్నికల కమిటీ గురువారం దీనిపై కసరత్తు జరిపింది. శుక్రవారం కూడా మరోసారి సమావేశం కావాలని బీజేపీ నాయకులు నిర్ణయించారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ అధ్యక్షతన ఏర్పడిన ఎన్నికల కమిటీలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు,పేరాల శేఖర్ రావు, బీజేపీ మాజీ ఎమ్మెల్యే జీ. కిషన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఇంద్రసేనరెడ్డి, ఎమ్మెల్సీ ఎన్. రామచందర్ రావు,
పార్టీ మాజీ ఎమ్మెల్యేలు బద్దం బాల్ రెడ్డి, ఈ.లక్ష్మీ నారాయణ, బీజేపీ సంస్థాగత రాష్ట్ర కార్యదర్శి మంత్రి శ్రీనివాసులు, పార్టీ ప్రధాన కార్యదర్శి చింతా సాంబమూర్తి,బీజేపీ జోనల్ ఇన్ ఛార్జ్ నాగురావు నమోజీ, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆకుల విజయ, మాజీ ఎమ్మెల్యే చందా లింగన్న దొర సభ్యులుగా ఉన్నారు.శుక్రవారం రెండోసారి వడపోత తర్వాత ముఖ్య నాయకులు ఢిల్లీ వెడతారు.శనివారం ఢిల్లీ లో పార్టీ పార్లమెంటరీ బోర్డు ఆమోదం తర్వాత అభ్యర్థుల జాబితా విడుదల కానున్నది.