ఎవ‌రీ రెహానా ఫాతిమా!!

తిరువనంతపురం:

ఓ సాధార‌న‌ ముస్లిం యువ‌తి ఎందుకు అయ్య‌ప్ప ద‌ర్శ‌నానికి ఆరాట ప‌డుతోంది?
రెహాన ఫాతిమా.. ఓ ముస్లిం యువ‌తి. వంద‌లాదిమంది పోలీసుల న‌డుమ అయ్య‌ప్ప ద‌ర్శ‌నానికి ఆత్రుత ప‌డుతోంది. స్వామి స‌న్నిదానానికి చేరుకోవడానికి స‌ర్వ శ‌క్తులొడ్డుతోంది. ఎందుకింత తాప‌త్ర‌యం.. తామ నిజంగా అయ్య‌ప్ప భ‌క్తురాలా..? స్వామి దీక్షాధార‌న చేసిందా..? లేదుక‌ధా..! మ‌రెందుకు అంత ఆత్రుత ప‌డుతోంది. ప్ర‌స్తుతం అంద‌రి మెద‌ల్ల‌ను తొలుస్తోన్న ప్ర‌శ్న ఇదే.. మ‌రింత‌కీ ఎవ‌రీ రెహానా వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం..

రెహానా ఫాతిమా 31 ఏళ్ళ‌ యువ‌తి.. BSNL లో టెలికాం టెక్నిషియ‌న్ గా కేంద్ర‌ప్ర‌భుత్వ ఉద్యోగం చేస్తోంది. సామాజిక హ‌క్కుల కార్య‌కర్త‌గా. కేర‌ళ అదికార సీపీయం పార్టీ స‌భ్యురాలుగా కొన‌సాగుతోంది. మొద‌టినుండి వామ‌ప‌క్ష బావ‌జాలం అధికంగా క‌లిగిన ఫాతిమా ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్ప‌ద వ్యాక్య‌లు చేస్తూ వార్త‌ల్లో నిలుస్తూంటుంది. ఒక మ‌ధ్య‌త‌ర‌గ‌తి ముస్లిం కుటుంభంలో పుట్టిన ఫాతిమా త‌న తండ్రి మ‌ర‌ణానంత‌రం స్త్రీ హ‌క్కుల కోసం పోరాటం చేస్తానంటూ బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. అనంత‌రం విద్యార్ధి ఉద్య‌మంలో పాల్గోంటూ ఓ ఫిల్మ్ మేక‌ర్ ను ప్రేమ‌ పెళ్ళి చేసుకోని ఇద్ద‌రు పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది.ఫాతిమా వ్య‌వ‌హార శైలి ముందునుండి వివాదాస్ప‌ద‌మే.. ఓక ఫ్రోఫెస‌ర్ తో జ‌రిగిన చిన్న వాద‌న‌కు ప్ర‌తిగా ఈ ఏడాది మార్చిలో త‌న బ్రెస్ట్ ను వాట‌ర్ మిల‌న్ తో క‌వ‌ర్ చేసుకుంటూ ఫోటోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసి వివాదాన్ని స్రుష్టించింది ఫాతిమా.. ఇది అప్ప‌ట్లో పెద్ద దుమారాన్నే క్రియేట్ చేసింది. చివ‌రికి ఫేస్ బుక్ అబ్యూసుడ్ కంటెంట్ పేరుతో తోల‌గించేస‌రికి వివాదం స‌ద్దుమ‌నిగింది.

ఇకపోతే 2014, KISS OF LOVE ఆందోళ‌న‌తో రెహానా వెలుగులోకి వ‌చ్చింద‌నే చెప్పుకోవాలి. సామాజిక విలువ‌ల‌కు వ్య‌తిరేఖంగా సాగిన కిస్ ఆఫ్ ల‌వ్ ఉద్య‌మానికి నేత్రుత్వం వ‌హించింది. ఈ సంద‌ర్భంగా త‌న బాయ్ ఫ్రెండ్ మ‌నోజ్ తో క‌లిసి శ‌బ‌రిమ‌ల ఆల‌యంలో అయ్య‌ప్ప ముందు త‌న బాయ్ ఫ్రెండ్ కు ముద్దుపెట్టాల‌నుంది. పార్టీ చేసుకోవాల‌నుంది అంటూ తాను చేసిన ప్ర‌క‌ట‌న‌లు అప్ప‌ట్లో ప్ర‌కంప‌న‌లు స్రుష్టించాయి.
ఇక రెహానా గురించి చెప్పుకోవాల్సిన మ‌రో సంద‌ర్భం.. ఈక అనే చిత్రం. స్త్రీ జ‌న‌నాంగాలు వాటి ఆవ‌శ్య‌క‌త, శ్రుంగారం వంటి విష‌యాల‌ను భ‌హిర్గ‌తం చేస్తూ చిత్రాన్ని తెర‌కెక్కించింది. రొమ్ములు క‌న‌ప‌డేలా త‌న టాప్ లెస్ ఫోటోతో పొస్ట‌ర్ ను రూపొందించి అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేసింది.ఇదిలా ఉంటే క‌ట్టుదిట్టమైన మూడంచెల పోలీసుల భ‌ద్ర‌త న‌డుమ‌, నేడు అయ్యప్ప స్వామి దేవాలయంలోనికి ప్రవేశించడానికి ప్రయత్నించింది రెహానా. కాగా అయ్య‌ప్ప‌స్వాముల అడ్డ‌గింత‌తో సుమారు రెండు కిలోమీటర్ల దూరం నుండే వెనుదిరిగాల్సిన ప‌రిస్తితి ఏర్ప‌డింది.