‘ఏకగ్రీవ’ ప్రతిజ్ఞ ‘కోడ్’ ఉల్లంఘన కాదు. – ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్.

హైదరాబాద్:

గురువారం నుండి ఎన్నికల మోడల్ కోడ్ అమల్లోకి వచ్చినట్టు తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ విలేకరులకు చెప్పారు.
మోడల్ కోడ్ తక్షణమే వస్తుందని,ఆపద్ధర్మ ప్రభుత్వం ఎలాంటి కొత్త పథకాలు ప్రవేశపెట్టరాదన్నారు.ఆపద్ధర్మ ప్రభుత్వం లో ఉన్న అధికార నిధులు ఖర్చు పెట్టరాదని చెప్పారు.ఇప్పటివరకు అభ్యంతరాలు 1543520 పెండింగ్ ఉన్నాయని, 15 రోజుల్లో 1315234 కొత్త అభ్యంతరాలు వచ్చాయని ఆయన తెలిపారు. ఓటరు నమోదు ప్రక్రియలో 2లక్షల 50 వరకు వెరైఫికేషన్ ఉన్నాయన్నారు.ఇంకా 4 వ తేదీవరకు సమయం ఉందన్నారు.28లక్షల ఈవీఎంలు, వివి ఫ్యాట్ లు ఈరోజుకి 10 వేల తప్ప అన్ని వచ్చాయని చెప్పారు.అన్ని జిల్లాల్లో ప్రాథమిక పరీక్ష స్టార్ట అయింది.4 వ తేదీ వరకు అన్ని జిల్లాలో అయిపోతుంది.మెడల్ కోడ్ వచ్చేముందు అడ్వాటేజ్ మెంట్ బోర్డ్స్ పెట్టారు దానిపై ఎలాంటి చర్యలు ఉండవు.ఇవాళ్టి నుండి మోడల్ కోడ్ ఉంటుంది. బతుకమ్మ, చీరలు, రైతు బంధు వంటివి కేంద్ర ఎన్నికల కమిషన్ కు తెలుపుతాం. అయితే కొత్త స్కిం లు,కొత్త పథకాలు పెట్టవద్దు అని మాత్రమే ఉంది.మంత్రులు ప్రభుత్వ వాహనాలు అధికారికంగా వాడుకోవచ్చు, కానీ ఎన్నికల ప్రచారంలో వాడకూడదు.

అభ్యంతరాలకు సమయం చాలా ఉంది ,డేటా ఎంట్రీ మాత్రమే ఉంది.డి లిమిటేషన్ కి స్టేట్ పునర్విభజన ప్రకారం భద్రాచలం నియోజకవర్గలో కొన్ని మండలాలు ఆంధ్రప్రదేశ్ కి వెళ్లిపోయాయని తెలిపారు.2015 లో ఇక్కడ నుండి విడిపోయిన మండలాలను ఆంధ్రాలో కలపాలని వారు నోటిఫికేషన్ ఇచ్చారని చెప్పారు.మధ్యప్రదేశ్ లో 230 నియోజకవర్గలు ఉన్నాయని, మనది చిన్న రాష్ట్రం అయినా అంతే స్టాఫ్ ఉన్నారని రజత్ కుమార్ చెప్పారు.మనకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు.నియోజవర్గాల పెంపు ప్రతిపాదనలు కేంద్ర ఎన్నికల కమిషన్ రిజెక్ట్ చేసిందన్నారు.”మీకే ఓటు వేస్తాం అంటూ ప్రతిజ్ఞ చెయ్యడం” వయలేషన్ కాదన్నారు.
5 లక్షలు ఇస్తాం అంటూ ఆఫర్ చెయ్యడం ఎన్నికల కోడ్ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

“2014 లో కొన్ని చోట్ల జనాభా కంటే ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది.2015లో 24 లక్షల బోగస్ ఓటర్లు గుర్తించి తొలగించాం.కేంద్ర ఎన్నికల కమిషన్ తో చూస్తే మనదగ్గర చాలా తక్కువ బోగస్ ఓట్లు ఉన్నాయి.20 లక్షల కొత్త ఓటర్ నమోదు చేసుకున్నారు, వాటిని వేరిఫై చేసి చెప్పాలి.డబ్బులు ,మద్యం సరఫరా పై నిఘా ఏర్పాటు చేశాం.మీడియా పై కూడా నిఘా పెట్టాం.ఎన్నికలు ఎప్పుడు అని మీకు ఎలా తెలుస్తుంది.కేంద్ర ఎన్నికల కమిషన్ ఎప్పుడు వస్తుంది అని నాకు ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు.కొత్త పథకాలు మాత్రమే ప్రవేశపెట్టకూడదు. మిగతావి యధావిధిగా అమలు చేయవచ్చు.ఎన్నికల మ్యానిఫెస్టో పై కూడా చెప్పాలి.24 గంటలు న్యూస్ ఛానెల్స్ ను నిఘా చేస్తాం”.అని సి.ఈ.ఓ.రజత్ కుమార్ వివరించారు.