‘ఏడు వారాల బతుకమ్మ’ పోస్టర్ ఆవిష్కరణ.

హైదరాబాద్:

ఉప్పెనకి ఉనికి అవసరం లేదు అన్నట్టు , బతుకమ్మ కి అంతరాలు, ఖండాంతరాలు అడ్డు కాదు , అప్రతిహత ఉప్పెన లాంటి ఉరుకు ఉత్సాహం తో ముందుకు వెళ్తూ విశ్వమంతా విచ్చుకున్న పుష్పాల కలయిక తో కొలువు తీరుతోంది తీరొక్క బతుకమ్మ మరో సారి .యునైటెడ్ కింగ్డమ్ ఈ సారి తెలంగాణ జాగృతి ఆ దేశం లోని ప్రసిద్ధి గాంచిన ఏడూ చోట్ల బతుకమ్మ సంబరాలు చేయడానికి సన్నాహాలు మొదలు చేస్తుంది.

అందుకు ఈ యేడు బతుకమ్మని “ఏడు వారాల బతుకమ్మ ” పేరుతో ఘనంగా నిర్వహిస్తున్నారు . జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు యునైటెడ్ కింగ్డమ్ లో జరుపనున్న “ఏడు వారాల బతుకమ్మ” పోస్టర్ ఆవిష్కరణ ఈ రోజు హైదరాబాద్ లోని తమ నివాసంలో చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జాగృతి ప్రధాన కార్యదర్శి రంగు నవీన్ ఆచారి, జాగృతి యూకే సలహాదారులు గోలి తిరుపతి , జాగృతి యూకే ఇండియా కో ఆర్డినేటర్ రోహిత్ రావు తో పాటు జాగృతి నాయకులు రాజీవ్ సాగర్, కుమారస్వామి, నితీష్ వాడ్రేవు , ప్రశాంత్ పూసా, దినేష్ రెడ్డి లు పాల్గొన్నారు. అక్టోబర్ లో భారీ ఎత్తున అంగ రంగ వైభవంగా జరగబోయే ఏడూ వారాల బతుకమ్మ సంబరాల్లో పాల్గొనడానికి శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు యూకే రానున్నారని ఇది అక్కడి ప్రవాస తెలంగాణీయుల్లో ఎంతో ఉత్సాహాన్ని నింపుతుందని , ఏడు వారాల బతుకమ్మ జరపడానికి అన్ని పనులు వేగంగా జరుగుతున్నాయనీ, త్వరలోనే మరిన్ని వివరాలతో ముందుకు వస్తామని తెలంగాణ జాగృతి యూకే అధ్యక్షుడు సుమన్ రావు బలమూరి ఈ సందర్బంగా ఫోన్ లైన్ లో తన సందేశాన్ని ఇండియా మీడియా తో పంచుకున్నారు.తెలంగాణ స్టేట్ మైనారిటీ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ లోగో, మొబైల్ యాప్ ను నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. శుక్రవారం హైదరాబాద్ లో ఎంపి కవిత నివాసంలో జరిగిన ఈ కార్య్ర క్రమానికి రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీల బాధ్యులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సంఘం బాధ్యులు మైనార్టీ ఉద్యోగుల సమస్యలను కవితకు వివరించారు. ప్రతి జిల్లాలో మైనారిటీ ఉద్యోగుల ఇళ్ళ స్థలాల కోసం 5 ఎకరాల చొప్పున ప్రభుత్వం కేటాయించేలా చూడాలని వారు కోరారు.ఎంపి కవిత ను కలిసిన వారిలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం. ఏ ఫరూక్ అహ్మద్, ప్రధాన కార్యదర్శి ఎం. ఏ నయీం, తౌఫీక్ ఉర్ రహ్మాన్, సయ్యద్ నయీమొద్దీన్, మోయినొద్దీన్, అబ్దుల్ రవూఫ్ తదితరులు ఉన్నారు.