ఏవోబీలో ఎన్‌కౌంటర్‌! నిజమా…వదంతా….

కోరాపుట్:

ఆంధ్ర-ఒడిషా సరిహద్దులోని (ఏవోబీ) కోరాపుట్‌ జిల్లా కుడుబు వద్ద పోలీసులు, మావోయిస్టులకు మద్య ఎదురుకాల్పులు జరుగుతున్నట్లు గురువారం రాత్రి విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ ఎన్‌కౌంటర్లో సుమారు 30 మంది మావోయిస్టులు పాల్గొన్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియల్సి ఉంది. కాగా, ఆదివారం ఉదయం ఏవోబీలోని అరకులోయలో టీడీపీకి చెందిన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే శివేరి సోమను మావోయిస్టులు కాల్చిచంపిన విషయం తెలిసిందే.ఎన్ కౌంటర్ ఘటన జరిగిన లివిడిపుట్టి గ్రామానికి చెందిన 20 మంది ఆదివాసులను గురువారం ఉదయం పోలీసులు తీసుకు వెళ్లినట్టు ప్రచారం జరుగుతున్నది. వారిని ఎక్కడికి తీసుకుని వెళ్లారన్న అంశంపై స్పష్టత లేదు.