ఏ.పి, ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టుల అలజడి.

విశాఖపట్నం:
విశాఖ మన్యంలో మావోయిస్టుల పిలుపు మేరకు అమరవీరుల సంస్మరణోత్సవాలు జరుగుతున్నాయి. ఆంధ్రా-ఒడిశా సరిహద్దు అటవీ ప్రాంతంలో గిరిజనులతో సమావేశాలు ఏర్పాటు చేసి ఇప్పటివరకు అమరులైన మావోయిస్టులకు నివాళులర్పిస్తున్నారు. బ్యానర్లతో అటవీ ప్రాంతాల్లో ర్యాలీ చేస్తున్నారు. ఆగస్టు 3 వరకు ఈ అమరవీరుల సంస్మరణోత్సవాలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ముందస్తుగా రాజకీయ నేతలను అప్రమత్తం చేశారు. మావోయిస్టు హిట్‌ లిస్టులో ఉన్నవారు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లిపోవాలని సూచించారు. జీకే వీధి మండలంలోని దారాలబయలులో శనివారం జయరామ్‌ అనే గిరిజనుడిని ఇన్‌ఫార్మర్‌ నెపంతో మావోయిస్టులు హత్య చేయడంతో ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో అలజడి నెలకొంది