ఏ.పి.కి ప్రత్యేక హోదా డిమాండ్ కు నితీష్ మద్దతు.

న్యూ డిల్లీ;
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్ ను బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గట్టిగా సమర్థించారు. ఆదివారం డిల్లీ లో జరుగుతున్న నీతిఆయోగ్ నాల్గవ సమావేశంలో ఏ.పి.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ రాష్ట్ర సమస్యలను ఏకరువు పెట్టారు. విభజన సమస్యల వల్ల ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అనుకున్నంత వేగంగా జరగడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం తమ రాష్ట్రాన్ని ఆదుకోవాలని,అన్ని విధాలుగా అండ దండలు ఇవ్వాలని కూడా చంద్రబాబు కోరారు. నీతి ఆయోగ్ సమావేశానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేక కేటగిరీ హోదా ఇవ్వాలన్న డిమాండ్‌కు మద్దతు పలికారు. అదే సమయంలో బిహార్‌కు కూడా ఈ హోదాను ఇవ్వాలని ఆయనడిమాండ్ చేశారు. నీతి ఆయోగ్ సమావేశం రాష్ట్రపతి భవన్‌లో జరుగుతున్నది. కేంద్ర మంత్రులు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు సమావేశంలోపాల్గొన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హాజరు కాలేదు.