ఒక ఒరలో రెండు కత్తులు!! పత్తా లేని ‘12 శాతం’

విశ్వహిందూపరిషత్, అర్.ఎస్.ఎస్, బిజెపిల కన్నా కెసిఆర్ కు ఆధ్యాత్మిక భావనలు ఎక్కువ.ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ధార్మిక విశ్వాసాలను బహిరంగంగా ప్రకటిస్తున్నారు. బిజెపి, ఆర్ ఎస్ ఎస్వాళ్ళు కూడా చేయని విధంగా ఆలయాలు నిర్మిస్తున్నారు.యాగాలుచేస్తున్నారు.అందువల్ల బిజెపి హిందుత్వ నినాదం తెలంగాణా లో పని చేయదు.” అని కెసిఆర్ కుమారుడు, మంత్రికేటిఆర్ ఇటీవలే మీడియాకుచెప్పారు.ముస్లిం రిజర్వేషన్లను తమిళనాడు తరహాలో వ షెడ్యూల్‌లో చేర్చి సాధించుకోవడం తప్ప వేరే పద్దతి లేదు. ఈ అంశంపై ఎస్టీ రిజర్వేషన్లపై  ప్రధాని మోదీతోమాట్లాడాను.ఆయనా సానుకూలత వ్యక్తం చేశారు. అవసరమైతేసుప్రీంకోర్టుకు వెళ్తాం” అని ముఖ్యమంత్రి కెసిఆర్ గతంలో అన్నారు.వెనకబడిన ముస్లింలకు రిజర్వేషన్లుకచ్చితంగా  అమలు చేస్తాం.అందుకోసం అన్ని పార్టీలు కలసి రావాలి.ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకువెళ్తాం” అనిఉపముఖ్యమంత్రిమహముద్‌ అలీ స్పష్టం చేశారు. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం 12 శాతం ముస్లిం రిజర్వేషన్లపై కేంద్రంతో గట్టిగా పోరాడలేదన్న అభిప్రాయం ముస్లిం మైనారిటీ వర్గాల్లో వ్యక్తమవుతున్నది.ధిల్లీ కి అఖిలపక్షాన్ని తీసుకువెళ్ళే వ్యవహారం కూడా నిలిచిపోయింది.

హైదరాబాద్;
ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు.వర్తమానచాణక్యుడైనటిఆర్ఎస్ సారధి కెసిఆర్ కుఇదేమంతఅసాధ్యమైనది కాదు. అలాంటి ‘రెండు కత్తుల’తోనూ తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్  ‘చెలిమి’చేస్తున్నారా?బిజెపి,ఎం.ఐ.ఎం రెండూమ‌త‌త‌త్వపార్టీలుగా ముద్ర పడినవే. ఆ రెండు పార్టీలతోనూ కెసిఆర్ అనుకూలంగా ఉన్నారన్నది టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ ఆరోపణ. రహస్యఒప్పందాల‌తోదేశ‌వ్యాప్తంగాబీజెపి,ఎం.ఐ.ఎంక‌లిసిప‌నిచేస్తున్నాయ‌ని ఆయన అంటున్నారు.అయన ఆరోపణల్లో నిజానిజాలు ఎలా ఉన్నా కెసిఆర్ మాత్రం. అటు హిందువులను, ఇటు మైనారిటీలను ఆకర్షించేందుకు అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. రైతాంగం,మహిళలు, ఉద్యోగులు తదితర వర్గాల లాగే ఈ ‘రెండు ఓటుబ్యాంకుల’నుకూడా తన ఆధీనంలోకి తీసుకొని వచ్చేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారు.విశ్వహిందూపరిషత్, అర్.ఎస్.ఎస్, బిజెపిల కన్నా కెసిఆర్ కు ఆధ్యాత్మిక భావనలు ఎక్కువ. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ధార్మిక విశ్వాసాలను బహిరంగంగా ప్రకటిస్తున్నారు. బిజెపి, ఆర్ ఎస్ ఎస్వాళ్ళు కూడా చేయని విధంగా ఆలయాలు నిర్మిస్తున్నారు.యాగాలుచేస్తున్నారు.అందువల్లబిజెపి హిందుత్వ నినాదం పని చేయదు.” అని కెసిఆర్ కుమారుడు, మంత్రికేటిఆర్ ఇటీవలే మీడియాకుచెప్పారు.12 శాతం రిజర్వేషన్లు కల్పించి తీరతామని ముఖ్యమంత్రి కెసిఆర్ చాలా సార్లు ప్రకటించారు. అంటే రెండు వర్గాలను ప్రసన్నం చేసుకోవడం కెసిఆర్ ‘స్కీమ్’ లో భాగంగా చూడవలసి ఉన్నది. ముస్లిం రిజర్వేషన్లపై పార్లమెంటులో  భీకరంగా పోరాడతాం. ఈ బిల్లుపై వెనక్కి తగ్గేది లేదు. రాష్ట్రపతి ఆమోదానికి బిల్లును పంపాం. కేంద్ర ప్రభుత్వానికి కాస్త సమయమివ్వాలన్న ఉద్దేశంతోనే ఇన్నాళ్లు వేచిచూశాం. దశాబ్దకాలంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం మైనారిటీ సంక్షేమానికి కేవలం రూ.932కోట్లు ఖర్చుచేస్తే, తెలంగాణ ప్రభుత్వం రూ.2,146 కోట్లు ఖర్చు చేసింది.ముస్లింలకు రిజర్వేషన్లు పెట్టాల్సిన పరిస్థితి రావడానికి మూలకారణం దశాబ్దాల కాంగ్రెస్‌ పాలనే.  ముస్లిం రిజర్వేషన్లను తమిళనాడు తరహాలో 9వ షెడ్యూల్‌లో చేర్చి సాధించుకోవడం తప్ప వేరే పద్దతి లేదన్నారు. ఈ అంశంపై, ఎస్టీ రిజర్వేషన్లపై  ప్రధాని మోదీతోమాట్లాడాను.ఆయనా సానుకూలత వ్యక్తం చేశారు. అవసరమైతేసుప్రీంకోర్టుకు వెళ్తాం. తొమ్మిదో షెడ్యూల్‌లో చేరితేనే రిజర్వేషన్లకు రక్షణ దొరుకుతుంది. అందుకు ప్రధాని సుముఖంగా ఉన్నారు. రిజర్వేషన్లపై కాంగ్రెస్‌ సహకారం తీసుకుంటాం. ముస్లింలకు కాంగ్రెస్‌ 4 శాతం రిజర్వేషన్‌ తెచ్చింది. ఎవరు మంచి చేసినా ఆ పేరు ఉంటుంది’’అని ముఖ్యమంత్రి కెసిఆర్ గత ఏడాది నవంబర్ లో శాసనసభలో చెప్పారు.
వెనకబడిన ముస్లింలకు రిజర్వేషన్లు  ఇస్తున్నాం.అది కూడా తమిళనాడు తరహాలో కల్పిస్తాం.కచ్చితంగా  అమలు చేస్తాం.అందుకోసం అన్ని పార్టీలు కలసి రావాలి.ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెల్తాం” అనికూడాఉపముఖ్యమంత్రిమహముద్‌ అలీ స్పష్టం చేశారు. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం 12 శాతం ముస్లిం రిజర్వేషన్లపై కేంద్రంతో గట్టిగా పోరాడలేదన్న అభిప్రాయం ముస్లిం మైనారిటీ వర్గాల్లో వ్యక్తమవుతున్నది.ధిల్లీ కి అఖిలపక్షాన్ని తీసుకువెళ్ళే వ్యవహారం కూడా నిలిచిపోయింది.అయితే తెలంగాణ రిజర్వేషన్ల వ్యవహారం డిల్లీలో తేలవలసి ఉన్నది. రాష్ట్ర పరిధిలో రిజర్వేషన్ల పెంపునకు తెలంగాణ అసెంబ్లీ చట్టం చేసింది. కానీ రిజర్వేషన్లు 50 శాతం కన్నా మించరాదంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇందుకు అవరోధం అవుతున్నది.తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి.దాన్నే కెసిఆర్ చాలా సార్లు ప్రస్తావించారు.కానీ ఈ వ్యవహారంపై నమోదైన పలు కేసుల విచారణ సుప్రీంకోర్టులో జరుగుతున్నది.బిజెపికి,సంఘ్పరివార్ కుమజ్లిస్ పార్టీ ‘ముస్లింమోర్చా’లా మారిపోయిందని శాసనమండలిలోప్రతిపక్షనాయకుడుమహమ్మద్ అలీ షబ్బీర్ ఆరోపిస్తున్నారు.బిజెపి,మజ్లిస్ పార్టీల మధ్య రహస్య అవగాహన జరిగిందని ఆయన అంటున్నారు.బీహార్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గతంలో బిజెపి వ్యతిరేకవోట్లు చీలిపోయే విధంగా ఎం.ఐ.ఎం.వ్యహరించిందని,ఒక పథకం ప్రకారమే ఆయా ప్రాంతాల్లో అభ్యర్థులను మజ్లిస్ నిలబెట్టిందని షబ్బీర్ అలీ ఆరోపించారు.మహారాష్ట్రలో బిజెపి-శివసేన 8 అసెంబ్లీ స్థానాలు గెలవడానికి మజ్లిస్ పరోక్షంగా సహకరించిందనిఅన్నారు.బీహార్ ఎన్నికల్లో బిజెపికి ప్రయోజనం కలిగించే విధంగానే మజ్లిస్ పోటీ చేసిందని షబ్బీర్ అలీ ఆరోపించారు. బీహార్ లో 24అసెంబ్లీ నియోజకవర్గాలలో  ముస్లిం ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉన్నప్పటికీబిజెపితో లాలూచీ కారణంగా బీహార్ లోని 243 అసెంబ్లీ స్థానాలకు గాను కేవలం 6 స్థానాలలో మజ్లిస్ పోటీ చేసినట్టు కాంగ్రెస్ నాయకుడు షబ్బీర్ అలీ అంటున్నారు. తమ స్వార్ధపూరిత రాజకీయ ప్రయోజనాల కోసం అసదుద్దీన్ ఒవైసీ, అక్బరుద్దీన్ఒవైసీ‘సంఘ్పరివార్’ తో చేతులు కలిపారన్నది ఆయన ఆరోపణ. బీహార్, మహారాష్ట్ర ప్రయోగాన్ని కర్నాటకలోనూ ఎంఐఎం అమలు చేసిందని,తెలంగాణలోనూ అలాంటి పథకాలను సిద్ధం చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఒవైసీ సోదరులపై మండిపడుతున్నారు. తెలంగాణలో మైనారిటీల సంఖ్య 14 శాతం దాటగా, ముస్లింల సంఖ్య 12 శాతం దాటిందని ప్రభుత్వం చెబుతున్నది. అదే విధంగా ఎస్సీల శాతం 15 నుంచి 16 శాతానికి పైగా పెరిగిందనిచెబుతున్నది.బిసిలు కూడా 50 శాతానికి పైగా ఉన్నారు. వెనుక బాటును అనుసరించి విద్యాసంస్థల ప్రవేశాల్లో, ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. అదే పద్ధతిన తెలంగాణలో కూడా ఇప్పటికే అమలవుతున్న రిజర్వేషన్లలో మార్పులు చేస్తూ  ప్రభుత్వం 2017 ఏప్రిల్‌ 16న అసెంబ్లీలో తెలంగాణ బ్యాక్వర్డ్‌ క్లాసెస్‌ అండ్‌ షెడ్యూల్డ్‌ ట్రైబ్స్‌ బిల్లు -2017ను ప్రవేశ పెట్టింది. దీని ప్రకారం తెలంగాణలో ఎస్టీల రిజర్వేషన్లు 6 నుంచి 10 శాతానికి, ముస్లింల రిజర్వేషన్లు 4 నుంచి 12 శాతానికి పెరిగాయి. మొత్తంగా తెలంగాణలో రిజర్వేషన్లు 50 నుంచి 62 శాతానికి పెరుగుతాయి.కాగాపార్లమెంటు రాజ్యాంగ సవరణ చేసి రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో రిజర్వేషన్ల పెంపు అంశాన్ని చేర్చవలసిఉంది.ఎస్టీలు, ముస్లింలకు రిజర్వేషన్లు పెంచుతూ అసెంబ్లీ చట్టం చేసిన నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు 2017 ఏప్రిల్‌ 24న కలిశారు. తెలంగాణ సామాజిక పరిస్థితులను, రిజర్వేషన్‌ పెంచడానికి కారణాలను వివరించారు. పెంచిన రిజర్వేషన్లు అమలయ్యే విధంగా సహకరించాలని కోరారు. తమిళనాడులో బలహీన వర్గాలు ఎక్కువగా ఉన్నారనే కారణంతో అక్కడ 69శాతం రిజర్వేషన్‌ అమలు చేసినప్పుడు, అదే సామాజిక పరిస్థితులున్న తెలంగాణలో రిజర్వేషన్‌ పెంచడానికి ఎవరికీ అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదన్నది కెసిఆర్ వాదన.ఇక తమ రాష్ట్రంలో 87 శాతం మంది బలహీన వర్గాలే అని తమిళనాడు రాష్ట్రం వాదించింది. కాబట్టి తమ రాష్ట్రంలో 69 శాతం రిజర్వేషన్లు అమలు చేసుకుంటామని చట్టం చేసి కేంద్ర ప్రభుత్వ ఆమోదం కూడా పొందింది. ఇప్పుడు తమిళనాడు రాష్ట్రంలో బిసిలకు30 శాతం, అత్యంత వెనుకబడిన తరగతులకు 20 శాతం, ఎస్సీలకు18 శాతం, ఎస్టీలకు 1 శాతం రిజర్వేషన్‌ అమలవుతున్నది. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎస్సీ, ఎస్టీ, బిసి, వర్గాలే పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఎస్సీలకుమినహా మిగతా వర్గాలకు వారి జనాభా నిష్పత్తిలో రిజర్వేషన్లు అమలు కావడం లేదు. 9 శాతమున్న ఎస్టీలకు 6 శాతం, 50 శాతం ఉన్న బిసిలకు25 శాతం, 12శాతమున్న ముస్లింలకు కేవలం 4 శాతం రిజర్వేషన్‌ అమలవుతున్నది.రాజస్థాన్‌ లోని బిజెపి ప్రభుత్వం  తమ రాష్ట్రంలో రిజర్వేషన్లను68 శాతానికి పెంచుతూ రెండు చట్టాలు చేసింది. గుజ్జర్లకు5 శాతం, ఇబిసిలకు14 శాతం రిజర్వేషన్లు కల్పించింది. తమ రాష్ట్ర సామాజిక పరిస్థితులకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచుకున్నామని, రాజ్యాంగ సవరణ చేసి అమలయ్యేలా చూడాలని ఆ రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపింది.ముస్లింలకు రిజర్వేషన్‌ పెంచితే బిసి. ఇ లో పెరుగుతాయి. మిగతా ఎ, బి, సి, డి లకు రిజర్వేషన్లు తగ్గవు. ముస్లింలతో కలిపి ప్రస్తుతం బిసిలకు అందుతున్న 29 శాతం రిజర్వేషన్లు కూడా పెరుగుతాయి.వెనుకబడిన కులాలకు దేశంలో 27 శాతం రిజర్వేషన్‌ అమలు చేస్తున్నారు. వెనుకబడిన తరగతుల్లోని పేదరికం ఆధారంగా మండల్‌ కమిషన్‌ సిఫారసులను అనుసరించి ఓబిసిలకు రిజర్వేషన్‌ కల్పించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు ఇదే సూత్రం తెలంగాణకు కూడా వర్తిస్తుందని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. తెలంగాణలో పెద్ద సంఖ్యలో ఉన్న ముస్లింలలో అత్యంత పేదరికం ఉన్నది. తెలంగాణ ప్రభుత్వం ముస్లింల స్థితిగతులపై అధ్యయనం చేయడానికి కమిషన్‌ వేసింది. ఆ కమిషన్‌ నివేదిక కూడా ఇచ్చింది. బిసి కమిషన్‌ కూడా ముస్లిం కులాల్లోని వెనుకబాటు ఆధారంగా రిజర్వేషన్లు కల్పించాలని సిఫారసు చేసింది. దాని ప్రకారమే రిజర్వేషన్‌ పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటున్నది. ముస్లింలకు మతపరంగా కాకుండా వారి వెనుకబాటుతనం ఆధారంగా రిజర్వేషన్లు కల్పించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన. బిసిలు, ఎంబిసిలకు అమలు చేస్తున్న 50 శాతం రిజర్వేషన్లలో తమిళనాడు ప్రభుత్వం ముస్లింలు, క్రిస్టియన్లకు3.5 శాతం చొప్పున సబ్‌ కోటాగా నిర్ణయించి రిజర్వేషన్లు అమలు చేస్తున్నది. పశ్చిమ బెంగాల్‌, కర్ణాటక, మణిపూర్‌ రాష్ట్రాల్లో ముస్లింలను ఓబిసిలుగా పరిగణించి రిజర్వేషన్లు కల్పించారు. కేరళ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఉద్యోగాల్లో ముస్లింలకు12 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో వెనుకబడిన ముస్లింలను బిసి ‘ఇ’ కేటగిరీగా పరిగణించి నాలుగు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. రిజర్వేషన్లు కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే రకంగా లేవు. ఆయా రాష్ట్రాల్లోని సామాజిక పరిస్థితులను, కులాల జనాభాను బట్టి రిజర్వేషన్ల శాతం మారుతుంది కూడా. కేంద్ర సర్వీసుల్లో ఎస్టీలకు 7.5 శాతం రిజర్వేషన్‌ అమలవుతున్నది. కానీ కొన్ని రాష్ట్రాల్లో ఎస్టీలకు 80 శాతం రిజర్వేషన్‌ ఉన్నది. ఓబిసిలకు27 శాతం రిజర్వేషన్‌ కేంద్రంలో ఉంటే, చాలా రాష్ట్రాల్లో ఇంతకంటే ఎక్కువేఉన్నది. కాబట్టి రిజర్వేషన్లు 50 శాతానికి మించవద్దనే అభిప్రాయం రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధమన్నది కెసిఆర్ వాదన.
అయితేముస్లింలకు 12 శాత  రిజర్వేషన్ల వ్యవహారంలో ఎలాంటి పురోగతి లేనందుకేబహుశాసి.ఎం.కెసిఆర్ శుక్రవారం నాటి‘దావతే ఇఫ్తార్’ విందు సమావేశంలో దీనిపై కామెంట్ చేయలేదు.