ఒక తల్లి.అంతిమ వేదన.

రవి,నల్లగొండ:

కొడుకుకు భారం కాకుడదని చావు ఖర్చులకని డబ్బు దాచుకుంది.కానీ నోట్ల రద్దనే విషయం తెలుసుకోలేక పోయింది.చనిపోయే చివరి క్షణంలో తన దిండును చూపుతూ కన్ను మూసింది.ఆ దిండులో 500 నోట్ల కట్ట,కొంచెం చిల్లర బయట పడింది.కంట తడి పెట్టిస్తున్న ఈ ఘటన నల్గొండ జిల్లా నార్కట్ పల్లి (మం)మాండ్ర గ్రామంలో చోటుచేసుకుంది. చనిపోయిన వృద్ధురాలు లక్షమ్మ ఎందరో తల్లులకు ఆదర్శమయ్యింది. ఇక్కడ చెప్పుకోదగ్గ గొప్ప విషయమేమిటంటే,చెల్లని నోట్ల గురించి కాదు.అమ్మ గొప్ప తనం గురించి,కొడుకు కోసం ఆమె పడ్డ తపన గురించి.పోతూ పోతూ కొడుకు భాధ్యతను గుర్తు చేసింది.