‘ఓటుకునోటు’….. మరియు రాజకీయం.

తెలుగు రాష్ట్రాలను కుదిపివేసిన ‘నోటుకు ఓటు కేసు’ను దాదాపు మూడేళ్ల తర్వాత దుమ్ము దులిపి బయటకు తీసి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఇటీవల హడావుడి చేశారు. గత మే 7 న ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి హుటాహుటిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష తాత్పర్యం అధికార యంత్రాంగానికి, ముఖ్యంగా పోలీసులకు అంతు చిక్కడం లేదు. మరుసటి రోజు మీడియాలో ఇదే పతాక వార్త. ఆ తర్వాత కేసు ఏమైందో ఎవరికీ తెలియదు. డిజిపి మహేందర్ రెడ్డి, ఎసిబిడిజి పూర్ణ చందర్రావు, వోటుకు నోటు కేసు సమయంలో ఎసిబిడిజి గా పని చేసిన ఏ.కె.ఖాన్, పలువురు ఉన్నతాధికారులు, న్యాయవాదులు సి.ఎం సమావేశంలో పాల్గొన్నారు. ఇక రేపో మాపో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి, చేతులకు బేడీలు వేసి కోర్టుకు తీసుకు వెళతారేమో అన్న చందంగా రెండు రోజులు మీడియా హడావిడి చేసింది. తీరా అదంతా భ్రమగా తేలిపోయింది. ఈ కేసులో చంద్రబాబు ‘స్వర నమూనా’ పై ఫోరెన్సిక్ రిపోర్టు ముఖ్యమంత్రికి అందిందంటూ ప్రచారం జరిగింది కూడా. ఫోరెన్సిక్ నివేదికపై ఎలాంటి చర్యలు తీసుకోవాలంటూ న్యాయ నిపుణుల సలహాలు సూచనలను కెసిఆర్ తీసుకున్నారని వార్తాకథనాలు వెలువడ్డాయి. ముఖ్యమంత్రి కెసిఆర్ ఓటుకు నోటు కేసులో ‘దూకుడు పెంచార’ని కొన్ని పత్రికలు అత్యుత్సాహాన్ని ప్రదర్శించాయి. చంద్రబాబు నాయుడు బిజెపి తో తెగతెంపులు చేసుకున్న తర్వాతే ఈ ‘సమీక్షా సమావేశం’ జరగడం ఆసక్తిని కలిగించే అంశం.

హైదరాబాద్;
‘‘ప్రభుత్వం అధికారంలో ఉందనిస్టింగ్ ఆపరేషన్లు చేయడం, ఫోన్లు ట్యాపింగ్ చేయడం, నకిలీ డాక్యుమెంట్లు సృష్టించడం నీచాతినీచం. ఫోన్లుట్యాప్ చేస్తే ప్రభుత్వాలే పడిపోయాయి. ఈ రోజు నేను ఒక వ్యక్తిని కాను. ఆంధ్రప్రదేశ్ముఖ్యమంత్రిని. నా ఫోన్ ట్యాప్ చేసే అధికారం కేసిఆర్ కు ఎవరిచ్చారు. నేను కెసిఆర్ కు సర్వెంట్ ను కాను. నీదొక ప్రభుత్వం. నాదొకప్రభుత్వం. నన్ను బెదిరించడం మీ తరం కాదు. శాంతిభద్రతలు గవర్నర్ పరిధిలో ఉన్నాయి. పదేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని. నీకు ఎసిబి ఉన్నది. మాకూ ఎసిబి ఉన్నది. మీకు పోలీసులు ఉన్నారు. మాకూ హైదరాబాద్ లో పోలీసులు ఉన్నారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. తలసాని శ్రీనివాసయాదవ్ తెలుగుదేశం పార్టీ నుంచి ఎం.ఎల్.ఏ గా గెలిచాడు. పార్టీకి రాజీనామా చేయకుండానే ఆయనతో మంత్రిగా గవర్నర్ తప్పుడు ప్రమాణ స్వీకారం చేయించాడు. పార్టీ ఫిరాయింపుల చట్టం అప్పుడు గుర్తుకు రాలేదా? ఎవరు లాలూచీ పడ్డారు? ఇరవై మంది ఎం.ఎల్.ఏ లు మాకు ఉన్నారు. మాకుఎం.ఎల్.సి పదవి ముఖ్యం కాదు. నేనెందుకు లాలూచీ పడతాను. నేనుపోరాడుతున్నా. సెక్షన్ 8 అమల్లో ఉంది. నాకు సిద్ధాంతం ముఖ్యం. నీతిముఖ్యం. మా ఫోన్లు ట్యాప్ చేయడానికి, మాపై అధికారం చెలాయించేందుకు కెసిఆర్ కు పెత్తనం ఎవరిచ్చారు. ఒకముఖ్యమంత్రిని అని చూడకుండా కించపరుస్తారా? నానా మాటలు అంటారా? నన్నుఅగౌరవపరుస్తారా? ఇంకా చాలా ఉన్నాయి తమ్ముళ్లూ. సమయం వచ్చినప్పుడు ఒక్కొక్క అస్త్రాన్ని బయటకు తీస్తా. అంత ఈజీగా వదిలిపెట్టను. ఇందిరాగాంధీ లాంటి నాయకురాలు ఎన్టీ రామారావు ముందు తలవంచాల్సివచ్చింది. ఎన్టీ రామారావు తలోంచలేదు’’. అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కెసిఆర్ పై గర్జించారు. నిప్పులు చెరిగారు.
“మొత్తం బండారం బయటపడింది. టివిలలో మీరు చూసిన్రా లేదా! చూసిన్రు కదా. పట్టపగలు దొంగలా దొరికిపోయిన్రు. ఇప్పుడు పెద్దగా మాట్లాడుతున్నాడు. నిన్ను ఇరికించే ఖర్మ మాకెందుకు . మాకాళ్ళు, చేతులు గులగులపెడుతున్నయా? నీ బాధ మాకెందుకు? మాకేమైనాపని లేకుండా ఉన్నామా? మా సమస్యలు మాకున్నై. మా పని మేము చేసుకోవడానికి రోజుకు 18 నుంచి 20 గంటలు పని చేసినా సరిపోదు. రామేశ్వరం పోయినా శనేశ్వరం పోలేదన్నట్టు ధిల్లీ లో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ ను పదేళ్లు ఉమ్మడి రాజధాని గా పెట్టినరు. నేను ఆరోజే చెప్పిన. ఈ దిక్కు మాలిన సమస్య మాకెందుకు అని అభ్యంతరం చెప్పిన. కానీ కాంగ్రెస్ సన్నాసుల వల్ల పదేండ్లు ఉమ్మడి రాజధాని అయింది. హైదరాబాద్ పై నీకెంత హక్కు ఉందొ, నాకంతే హక్కు ఉందని చంద్రబాబు అంటున్నాడు. హైదరాబాద్ నీ అబ్బజాగీరా? నీతాతదా?హైదరాబాద్ కు నువ్వు కాదు ముఖ్యమంత్రివి. తెలంగాణ బిడ్డ ముఖ్యమంత్రి. దొంగతనం చేసి, దొరికిపోయి, నగ్నంగా పచ్చిగా, పట్టుబడి గాయి, గాయి చేస్తున్నడు. అరచి పెడబొబ్బలు పెడుతున్నడు. గల్లీ నుంచి ధిల్లీ దాకా నీ బతుకేందో, నీరాజకీయాలేందో, లుచ్చపనేందో, నీ లఫంగి పనేందో, లత్కోర్పనేందో అందరికీ తెలిసి పోయింది. తెలంగాణ ప్రజలు నీకు శాస్తి జేస్తరు.ఎసిబిఉంటె నాకు భయమెందుకు.కెసిఆర్ నీ లెక్క దొంగ కాదు కదా.దొంగరాజకీయాలు కెసిఆర్ చేయడుకదా. ఎం.ఎల్.సి ఎన్నికల్లో గెలిచే ఓట్లు లేకపోయినా ఎందుకు పోటీ పెట్టినవ్. నువ్వునీతిమంతునివిగదా!సత్యహరిశ్చంద్రు ని ఇంటి వెనుకనే నీ ఇల్లు గదా.. పోటీ ఎందుకు పెట్టినవ్. ఎం.ఎల్.ఏ.లను కొనాలనే లఫంగి పనులు ఎందుకు చేసినవ్. డబ్బులిచ్చిఇతర పార్టీల ఎం.ఎల్.ఏ లను కొనాలని చూసినవు. రాజకీయాలుభ్రష్టు పట్టించాలని చూసినవు. మా తెలంగాణ బిడ్డ, ఆంగ్లో ఇండియన్ స్టీఫెన్ సన్ ను కొనాలని చూసినవ్. ఆయన ఎసిబికి చెప్పి పట్టించిండు. నీ దుర్మార్గం బయటకొచ్చింది.. నీఎం.ఎల్.ఏ జైల్లో ఉన్నడు. నీ గుట్టు కూడా బయట పడుతాంది. నువ్వు ఫోన్లలో మాట్లాడుతున్న విషయాల వల్ల నీ సంగతి కూడా తెలుస్తున్నది. నిన్ను అమాయకంగా ఇరికించినమా?పట్టపగలు చేసిన దొంగతనాన్ని కూడా అరుపులు, పెడబొబ్బలతో ని గాయి చేసి మూసేద్దామనుకున్టున్నావా? నిన్ను ఎవరూ కాపాడలేరు. ఆ బ్రహ్మ దేవుడు కూడా రక్షించలేడు. ఇంకా ఎక్కువ మాట్లాడితే నీకు తెలంగాణ సమాజం ఏం శాస్తిజేస్తుందో ఆ శాస్తి కూడా తప్పదు. తస్మాత్ జాగ్రత్త.’’ అని చంద్రబాబుకు కెసిఆర్ అత్యంతకటువుగా తెలంగాణ మాండలికంలో కౌంటర్ ఇచ్చారు. 2015 జూన్ లో ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకరిపై, మరొకరు చేసుకున్న ‘మాటల’ దాడులివి.

తెలుగు రాష్ట్రాలను కుదిపి వేసిన ‘నోటుకు ఓటు కేసు’ ను దాదాపు మూడేళ్ల తర్వాత దుమ్ము దులిపి బయటకు తీసి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఇటీవల హడావుడి చేశారు. గతమే 7 న ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి హుటాహుటిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష తాత్పర్యం అధికార యంత్రాంగానికి, ముఖ్యంగా పోలీసులకు అంతు చిక్కడం లేదు. మరుసటి రోజు మీడియాలో ఇదే పతాక వార్త. ఆ తర్వాత కేసు ఏమైందో ఎవరికీ తెలియదు. డిజిపి మహేందర్ రెడ్డి, ఎసిబిడిజి పూర్ణచందర్రావు, వోటుకు నోటు కేసు సమయంలో ఎసిబిడిజి గా పని చేసిన ఏ.కె.ఖాన్, పలువురు ఉన్నతాధికారులు, న్యాయవాదులు, న్యాయ నిపుణులు సి.ఎం సమావేశంలో పాల్గొన్నారు. ఇక‘ రేపో మాపో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి, చేతులకు బేడీలు వేసి కోర్టుకు తీసుకు వెళతారేమో’ అన్న చందంగా రెండు రోజులు మీడియా హడావిడి చేసింది. తీరా అదంతా భ్రమగా తేలిపోయింది. ఈ కేసులో చంద్రబాబు ‘స్వర నమూనా’ పైఫోరెన్సిక్ రిపోర్టు ముఖ్యమంత్రికి అందిందంటూ ప్రచారం జరిగింది కూడా.ఫోరెన్సిక్ నివేదికపై ఎలాంటి చర్యలు తీసుకోవాలంటూ న్యాయనిపుణుల సలహాలు సూచనలను కెసిఆర్ తీసుకున్నారని వార్తాకథనాలు వెలువడ్డాయి. ముఖ్యమంత్రి కెసిఆర్ ఓటుకు నోటు కేసులో ‘దూకుడు పెంచార’ని కొన్ని పత్రికలు అత్యుత్సాహాన్ని ప్రదర్శించాయి. చంద్రబాబునాయుడు బిజెపి తో తెగతెంపులు చేసుకున్న తర్వాతే ఈ ‘సమీక్షా సమావేశం’ జరగడం ఆసక్తిని కలిగించే అంశం. వోటుకు నోటు కేసును బూచిగా చూపించి జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు బాబు దూకుడుకు కళ్ళెం వేయాలని కేసీఆర్ భావిస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. మండలి ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్వి స్స్టీఫెన్‌సన్ ఓటుకోసం తెలుగుదేశం పార్టీ 50 లక్షల రూపాయలు ఇస్తుండగా తెలంగాణ ఏసిబి వల పన్ని పట్టుకుంది. ఈ కేసులో టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అరెస్టయి బెయిల్‌పై బయటకొచ్చారు. ఆయన ప్రస్తుతం కాంగ్రెస్ లో కొనసాగుతున్నారు. నామినేటెడ్ఎం.ఎల్.ఏ. స్టీఫెన్ సన్ ఇంట్లో అవినీతి నిరోధక శాఖకు పట్టుబడిన 50 లక్షలు పాత రద్దయిన నోట్ల రూపంలో ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఇచ్చిన మొత్తం ఇదేనని చెప్పడానికి గానీ, వాటి నెంబర్లు, బ్యాంక్ ట్యాగులు ఏమీ లేకుండా బ్యాంకులో చేరి పోయాయి. ఇదే విషయాన్ని హైకోర్టు కు ఏసిబి గతంలో తెలిపింది. ఈ “అక్రమ నగదు” మొదట ఏసిబి కోర్టులోనే ఉండేది. రద్దయిన నోట్లను కోర్టు అనుమతితో తీసుకెళ్లి బ్యాంకులో డిపాజిట్ చేసేశారు. ఈ మొత్తాన్ని చెలామణీలోకి తెచ్చారు తప్ప, వివరాలను ఇన్వెంటరీ (సమగ్ర జాబితా)కి ఎక్కించడం మరచిపోయారని తెలుస్తోంది. ఇక, ఈ కేసుకు మిగిలిన సాక్ష్యాలుగా వీడియో క్లిప్పింగ్, వాయిస్ నిర్ధారణ చేస్తూ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ఇచ్చిన సర్టిఫికేట్ మాత్రమే మిగిలాయి. కీలకమైన నగదుమాత్రం యధాతథ రూపంలో లేదు.