కక్ష సాధింపు ఆపకపోతే ప్రతీకారం తప్పదు. – కాంగ్రెస్ నాయకుల హెచ్చరిక.

హైదరాబాద్:
అక్రమంగా కేసీఆర్ కాంగ్రెస్ నాయకులపై కక్ష్య సాధింపు చర్యలను వెంటనే నిలిపి వేయాలని కాంగ్రెస్ నాయకులు ఉత్తమ్, జానారెడ్డి, వి.హెచ్ వేర్వేరుగా హెచ్చరించారు. ఉదేశ్య పూర్వకంగానే కేసీఆర్ ప్రతిపక్షాల పై తప్పుడుకేసులు పెడుతున్నారని ఆరోపించారు. ప్రతిపక్షాల గొంతు నోక్కే విధంగా కేసీఆర్ వ్యవరిస్తున్నాడని అన్నారు. జగ్గారెడ్డి ని అక్రమంగా అరెస్టు చేయించారని,ఇప్పుడు రేవంత్ రెడ్డిపై దాడులు చేయిస్తున్నారని అన్నారు.ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.ఐటీ వారికి డబ్బులు దొరకాలంటే ప్రగతిభవన్ లో వెతకాలని సూచించారు.డబ్బులు దోచుకున్న కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం అధికారులతో దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. సాగునీటి ప్రాజెక్టులపై 6శాతం కమీషన్ లు కేటీఆర్ వసూళ్లు చేశాడని ఆరోపించారు.ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయిన నుండి కాంగ్రెస్ నాయకులను టార్గెట్ చేశారని కాంగ్రెసు నాయకులు చెప్పారు.
ఇది కేసీఆర్ కుటుంబానికి తెలంగాణ సమాజానికి జరుగుతున్న ఎన్నికలుగా ముగ్గురు నాయకులు అభిప్రాయపడ్డారు. ప్రజలు టిఆర్ఎస్ కు బుద్ది చెబుతారని తెలిపారు.ఇది తెలంగాణ ప్రజలపై జరుగుతున్న దాడులని అన్నారు.

4కోట్ల తెలంగాణ ప్రజలను అణచివేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.ప్రజాస్వామ్య విలువల్ని కాలరాస్తున్నారని ఆరోపించారు. సమస్యలపై పోరాడే నాయకుల పై టార్గెట్ చేసి భయపెట్టాలని చూస్తున్నారని చెప్పారు. ఇలాంటి ప్రభుత్వాలు కొనసాగకూడదని ప్రజలు కోరుకుంటున్నారని జానారెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్ ను ఓడించి కెసిఆర్ కు బుధ్ధి చెప్పాలని ఆయన ప్రజలను కోరారు. ఎన్ని దాడులు చేసినా వీటిని తిప్పికొడతామన్నారు. సకల జనులు జరుగుతున్న పరిణామాలను గమనించాలని విజ్ఞప్తి చేశారు.మీడియా స్వేచ్ఛను కేసీఆర్ కాలరాశారని ఆరోపించారు. మెట్రో రైల్ ప్రారంభోత్సవంలో గవర్నర్ టిఆర్ఎస్ నేతలాగా వ్యవహరించాడని వి.హెచ్.మండిపడ్డారు.

కేటీఆర్ కు మద్దతు పలికెలా గవర్నర్ ప్రవర్తిస్తున్నాడని చెప్పారు.మెట్రో రైల్ ప్రారంభోత్సవం తరువాత గవర్నర్ కేటీఆర్ తో కలిసి సైకిల్ తొక్కడమేమిటని ప్రశ్నించారు.
భవిష్యత్ సీఎం కేటీఆర్ అని గవర్నర్ ఇంప్రెషన్ ఇచ్చారని వి.హెచ్. అన్నారు. గవర్నర్ కేసీఆర్ కు తొత్తు అని ఆరోపించారు.రాష్ట్రంలో ఆపద్ధర్మ ప్రభుత్వంలా లేదన్నారు.కేసీఆర్ ఇంకా అధికార దుర్వినియోగం చేస్తున్నాడని తెలిపారు.సర్కార్ సోమ్ముతో ప్రకటనలు ఇచ్చి రాజ్యసభ సభ్యుడు సంతోష్ కమీషన్ దండుకుంటున్నాడని వి.హెచ్.ఆరోపించారు. రేవంత్ రెడ్డి పై ఈడీ దాడులు రాజకీయ కక్ష సాదింపేనన్నారు. మోడీతో కుమ్ముకై కేసీఆర్ ఇలాంటి కేసులను దాడులను ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. కేసీఆర్ కుటుంబంపై ఈడీ దాడులు చేస్తే వేలకోట్ల దొరుకుతాయని వి.హెచ్.చెప్పారు. కేసీఆర్ ఇలాంటి రాజకీయ కక్ష సాధింపులు మానుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రతీకారం తప్పదని వి.హనుమంతరావు హెచ్చరించారు.