కరీంనగర్ లో వెల్ నెస్ సెంటర్ ప్రారంభం.

హైదరాబాద్:
క‌రీంన‌గ‌ర్ లో ఉద్యోగులు, పెన్షనర్లు, జర్నలిస్టుల కోసం ఏర్పాటు చేసిన వెల్‌నెస్ సెంట‌ర్‌కు ప్రారంభోత్స‌వం, ఆయుష్ హాస్పిట‌ల్‌కు శంకుస్థాప‌న, హౌసింగ్ బోర్డు కాల‌నీలో ఏర్పాటు చేసిన అర్బ‌న్ హెల్త్ సెంటర్లను ప్రారంభించిన వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి, పాల్గొన్న ఆర్థిక, పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్.
ఆనంతరం నిర్వహించిన ప్రెస్ మీట్ లో మంత్రులు మాట్లాడారు.

మంత్రి లక్ష్మారెడ్డి కామెంట్స్:
గతంతో పోలిస్తే అద్భుతమైన వైద్యం అందిస్తున్నాం.గత నాలుగేళ్లలో ఎప్పుడూ లేనంత అభివృద్ధి వaైద్య రంగంలో జరిగింది.
కరీంనగర్ లో కనీసం icu లు కూడా లేని దుస్థితి ని చూశాం.ఇప్పుడు ఒక్క కరీంనగర్ లోనే icu లు, లేబర్ రూమ్స్, డయాలిసిస్ సెంటర్, మాతా శిశు వైద్య కేంద్రం, అర్బన్ హెల్త్ సెంటర్స్ ని ప్రారంభించుకున్నాం.పడకలు పెంచుకున్నాం, ఆధునిక వసతులు ఎన్నో వచ్చాయి.
కార్పొరేట్ హోసిటల్స్ కి ధీటుగా, ఇంకా మెరుగ్గా సర్కార్ దవాఖానాలను తీర్చిదిద్దుతున్నాం.త్వరలోనే కరీంనగర్ లో కూడా బస్తి దవాఖానాలు ప్రారంభిస్తాం.
హైదరాబాద్ లో వెయ్యి దవాఖానాలు ప్రారంభిస్తున్నాం.రాష్ట్రంలో మొత్తం 1500 బస్తి దవాఖానాలు పెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.
ఆయుష్ హోసిటల్స్ 5 రాష్ట్రానికి మంజూరయ్యాయి. అందులో ఒకటి కరింనగర్ లో పెడుతున్నాం. దానికి శంకుస్థాపన చేశాం.
వెల్ నెస్ సెంటర్స్ ని దేశంలో మొదటి సారిగా ప్రారంభిస్తున్నాం.అన్ని పాత జిల్లా కేంద్రాల్లో వెల్ నెస్ సెంటర్స్ ని ప్రారంభిస్తున్నాం.కరీంనగర్లో మొదలైంది 5వది.రాష్ట్రంలో 40 డియాలిసిస్ సెంటర్స్ నో ప్రారంభిస్తున్నం.అందులో ఒకటి ఈ రోజు కరీంనగర్ లో మొదలుపెట్టాం.స్టాఫ్ కొరత ఉందన్న మాట నిజమే.గత 10 ఏళ్లకు పైగా నియామకాలు జరగలేదు10 వేల కి పైగా ఉద్యోగాల నియామకాల ప్రక్రియ కొనసాగుతున్నదిప్రజలు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని గమనించాలి.సీఎం కేసీఆర్ చేస్తున్న ప్రగతికి పట్టం కట్టాలి.

మంత్రి ఈటల రాజేందర్ కామెంట్స్:
విద్య, వైద్యం ప్రజలకు అందించడం ప్రభుత్వాల కనీస బాధ్యత.ప్రభుత్వం విద్య, వైద్యం మీద ప్రత్యేక దృష్టి పెట్టింది.ఈ రెండింటి కోసం లక్షలు తగలేసుకున్న నిరుపేదల కోసం ప్రభుత్వ పాటు పడుతున్నది.పేదలకు విద్య, వైద్యం ఉచితంగా, మెరుగ్గా అందించాలన్నదే ప్రభుత్వం ధ్యేయం.
గతంలో ఎన్నడూ, ఇంత స్థాయి అభివృద్ధి జరగలేదు.కరీంనగర్ లోనూ విద్య, వైద్య పరంగా అనూహ్యమైన అభివృద్ధి జరిగింది.అధునాతన భవనాలు పరికరాలు, సదుపాయాలు సమకూరాయి.సీఎం కేసీఆర్ చొరవ, మంత్రి లక్ష్మారెడ్డి కృషి ఫలించి వైద్యశాలలు బాగు పడుతున్నాయి.

అల్లం నారాయణ కామెంట్స్:
8900 మందికి ఇప్పటి వరకు హెల్త్ కార్డులు ఇచ్చాం.36 వేల మందికి హెల్త్ కార్డులు ఇచ్చే అవకాశం ఉంది.వెల్ నెస్ సెంటర్స్ మీద దుష్ప్రచారం చేయడం తగదు.పాలమూరు జిల్లా జర్నలిస్టుకి కాలేయ మార్పిడికి రూ. 23 లక్షలు మంజూరయ్యాయి.హెల్త్ సదుపాయం కల్పించినందుకు సీఎం కేసీఆర్, మంత్రి లక్ష్మారెడ్డి కి కృతజ్ఞతలు.అబద్ధాలు ప్రచారం చేయకండి. ఎవరైనా చేస్తే నమ్మొద్దు.

tngo నేత కారం రవీందర్ రెడ్డి కామెంట్స్:
దేశంలో ఎక్కడా లేని విధంగా వెల్ నెస్ సెంటర్స్ ని రాష్ట్రంలో ప్రారంభించడం గొప్ప విషయం
నల్గొండ జిల్లా tngo ఉద్యోగికి రూ.26 లక్షలతో కాలేయ మార్పిడి జరిగింది.ఇదంతా తెలంగాణ ప్రభుత్వ మంచి తనం కి నిదర్శనం
ఈ కార్యక్రమాల్లో క‌రీంన‌గ‌ర్ జడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ, ఎమ్మెల్యే గంగుల క‌మ‌లాక‌ర్‌, వివిధ ఉద్యోగ సంఘాల నేతలు కృష్ణ యాదవ్, సత్యనారాయణ, స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు తదితరులు పాల్గొన్నారు.