‘కరుణ’ విషమం.

  • సీఎం పళనిస్వామితో స్టాలిన్ భేటీ.

చెన్నై:
డీఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్యం ‘వెరీ క్రిటికల్’ అని వైద్యులు ప్రకటించారు. కరుణ ఆరోగ్యం మళ్లీ విషమించినట్లు తెలియగానే ఆయన తనయుడు, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామితో డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ ఇవాళ మధ్యాహ్నం సమావేశమయ్యారు. చెన్నై గ్రీన్‌వేస్ రోడ్‌లోని పళనిస్వామి నివాసానికి చేరుకున్న స్టాలిన్.. తన తండ్రి ఆరోగ్య పరిస్థితిని వివరించారు. ఇద్దరు ప‌లు అంశాల‌పై అర‌గంట చ‌ర్చించిన‌ట్లు స‌మాచారం. కరుణానిధి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారని, ఆరోగ్యం క్షీణించిందని డాక్టర్లు వెల్లడించారు. వైద్యుల ప్రకటనతో కరుణ అభిమానులు కన్నీరు మున్నీరవుతున్నారు.