కర్ణాటక మంత్రివర్గ విస్తరణ వాయిదా?

బెంగళూరు;

కర్ణాటకలో ఈ నెల 10న చేపట్టాల్సిన మంత్రివర్గ విస్తరణ, శాఖల మార్పులు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రంలోని మూడు లోక్ సభ స్థానాలు, రెండు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో ఇవాళ్టి నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్టయింది. అందువల్ల మంత్రివర్గ విస్తరణ వాయిదా పడటం ఖాయమని తెలుస్తోంది. కర్ణాటకలో సీఎం కుమారస్వామి ఖాళీ చేసిన రామనగర, ఎమ్మెల్యే సిద్దూ బి న్యామగౌడ మరణంతో ఖాళీ అయిన జామఖండి అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. అలాగే బి.శ్రీరాములు ఖాళీ చేసిన బళ్లారి, బీజేపీ నేత బీఎస్ యడ్యూరప్ప స్థానం శివమొగ్గ, మాండ్య లోక్ సభ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది.