కాంగ్రెస్ కు భారీ వలసలు. పేర్లు బయటపెట్టం. ప్రోటోకాల్ ఉల్లంఘన పై స్పీకర్ కు ఫిర్యాదు. – భట్టివిక్రమార్క.

హైదరాబాద్:
ప్రభుత్వ కార్యక్రమాలను టీఆరెస్ పార్టీ ప్రోగ్రామ్స్ గా నిర్వహిస్తున్నారని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క అన్నారు.మథిర నియోజకవర్గంలో కనీస ప్రోటోకాల్ పాటించడం లేదన్నారు.స్థానిక అధికారులు ,స్థానిక ప్రజాప్రతినిధులకు కనీస సమాచారం ఇవ్వడం లేదని చెప్పారు. టీఆరెస్ జిల్లా అద్యక్షులే జిల్లా
కలెక్టర్లు గా పని చేస్తున్నట్టు ఆరోపించారు.నిబంధనలకు వ్యతిరేకంగా బదిలీలు చేస్తున్నారని,దొంగతనంగా అధికారులు చార్జ్ తీసుకుండటం సిగ్గుచేటన్నారు.
ప్రోటోకాల్ ఉల్లంఘన పై సీ.ఎస్ కు ,స్పీకర్ లకు పిర్యాదు చేస్తానని భట్టి చెప్పారు.
చాలామంది కాంగ్రెస్ లో చేరుతామంటున్నారని ఆయన అన్నారు.ఎలాంటి షరతులు లేకుండా పార్టీ బలోపేతానికి కృషి చేస్తామంటున్నారని కూడా చెప్పారు.వారిని పార్టీలో చేర్చుకోవాలని పార్టీ నిర్ణయించిందని విక్రమార్క తెలిపారు.
కాంగ్రెస్ సిద్ధాంతాలు నమ్మి వస్తున్న వారిని ఆవ్వానిస్తామని తెలిపారు.పార్టీలో చేరేవారి పేర్లు ఇప్పుడే చెబితే,అధికార పార్టీ బెదిరింపులు ,బ్లాక్ మెయిల్ చేస్తారని భట్టి అన్నారు.మాజీ ఎం.పి
రేణుకను సస్పెండ్ చేయాలంటున్న వారు కాంగ్రెస్ కార్యకర్తలు కాదని ఆయన అన్నారు.