కాంగ్రెస్ గేమ్ టీఆర్ఎస్పరేషాన్.

ఖ‌మ్మం అసెంబ్లీ సీటుకు శాప‌మో, ఆన‌వాయితీయో గానీ ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్రంలో అధికారం చెలాయించిన ఏ పార్టీ కూడా అక్క‌డ గెలవలేదు. దీంతో ప్ర‌తిప‌క్ష పార్టీ ఎమ్మెల్యేలే ప్ర‌తినిధ్యం వహిస్తూ వ‌చ్చారు. ఖ‌మ్మంలో గెలిచిన పార్టీ అధికారంలోకిరాద‌న్నఅప‌వాదు కూడా ఉన్నది.2019ఎన్నిక‌ల‌లోఖ‌మ్మంరాజ‌కీయంరంజుగాఉండబోతున్నది. 2014ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన పువ్వాడఅజ‌య్ కుమార్ అధికార పార్టీ కండువా క‌ప్పుకున్నారు.పాలేరులో కాంగ్రెస్ క్యాడ‌ర్బ‌లంగాఉన్న‌ది. ఈ నేప‌థ్యంలోతుమ్మ‌లప్ర‌త్యర్థిగాజ‌ల‌గంప్ర‌సాదరావునిల‌బ‌డితేరెండు పార్టీల మధ్య గట్టి పోటీ ఉంటుందని అంచ‌నా వేస్తున్నారు. తుమ్మ‌లను ఓడించే సత్తా ప్ర‌సాద‌రావుకుమాత్ర‌మేఉంద‌ని కాంగ్రెస్ లో ఒక వ‌ర్గంనేత‌లు చెబుతున్నారు.

ఖమ్మం:
ఖమ్మం జిల్లాలో ఈసారీహోరాహారీతప్పేలా లేదు. అధికార టీఆర్ఎస్ పార్టీ ఖ‌మ్మం జిల్లా మీద గంపెడాశ‌లు పెట్టుకుంది. కానీ కాంగ్రెస్ సీనియ‌ర్లనేత‌లంతా రంగంలోకి దిగ‌డంతోప‌రిస్థితిలోఊహించ‌ని మార్పు క‌నిపిస్తోంది. పాలేరు సీటు విజ‌యంఖాయ‌నిటీఆర్ఎస్అంచ‌న వేసుకుంటోంది. అక్క‌డ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి తుమ్మ‌లనాగేశ్వ‌ర‌రావుగ‌తంలోఎన్న‌డూ లేని రీతిలో అభివృద్ది కార్యకలాపాలు అమలు చేస్తున్నారు. భ‌క్త‌రామ‌దాసుఎత్తిపోత‌లప‌థ‌కం పూర్తి చేసి క‌రువునుపార‌దోలా రు. అయితేపాలేరు బ‌రిలో ఈసారి మాజీ మంత్రి జ‌ల‌గంప్ర‌సాదరావు పాలేరుబ‌రిలోదిగుతార‌నిప్ర‌చారంజ‌రుగుతోంది. కాంగ్రెస్ లో క్రియాశీలంగాలేకపోయినా,జిల్లా అంతటాప‌ట్టున్ననేత‌గా, జిల్లాలో ఏమూల‌కు వెళ్లినా అనుచ‌రులుక‌లిగిననాయ‌కునిగా ఆయనకు గుర్తింపు ఉన్నది. తండ్రి జలగంవెంగ‌ళ‌రావుచ‌రిష్మా కూడా తోడుగా ఉండవచ్చు. పాలేరులో కాంగ్రెస్ క్యాడ‌ర్బ‌లంగాఉన్న‌ది. ఈ నేప‌థ్యంలోతుమ్మ‌లప్ర‌త్యర్థిగాజ‌ల‌గంప్ర‌సాదరావునిల‌బ‌డితేరెండు పార్టీల మధ్య గట్టి పోటీ ఉంటుందని అంచ‌నా వేస్తున్నారు. తుమ్మ‌లను ఓడించే సత్తా ప్ర‌సాద‌రావుకుమాత్ర‌మేఉంద‌ని కాంగ్రెస్ లో ఒక వ‌ర్గంనేత‌లు చెబుతున్నారు. అయితే జ‌ల‌గంప్ర‌సాద్ రావును ఖ‌మ్మం జిల్లాలోని ఓ బల‌మైన గ్రూపు ఒకటిఅడ్డుకుంటున్న‌ట్టుస‌మాచారం. రేణుక చౌద‌రి, భ‌ట్టివిక్ర‌మార్క‌, పొంగులేటిసుదాక‌ర్ రెడ్డి లాంటి వారికి జ‌ల‌గంప్రసాద్ రాక న‌చ్చ‌డంలేద‌నికార్య‌క‌ర్త‌లుఅంటున్నారు.మరో వైపు ఖ‌మ్మం అసెంబ్లీ సీటుకు శాప‌మో, ఆన‌వాయితీయో గానీ ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్రంలో అధికారం చెలాయించిన ఏ పార్టీ కూడా అక్క‌డ గెలవలేదు. దీంతో ప్ర‌తిప‌క్ష పార్టీ ఎమ్మెల్యేలే ప్ర‌తినిధ్యం వహిస్తూ వ‌చ్చారు. ఖ‌మ్మంలో గెలిచిన పార్టీ అధికారంలోకిరాద‌న్నఅప‌వాదు కూడా ఉన్నది.2019ఎన్నిక‌ల‌లోఖ‌మ్మంరాజ‌కీయంరంజుగాఉండబోతున్నది. 2014ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన పువ్వాడఅజ‌య్ కుమార్ అధికార పార్టీ కండువా క‌ప్పుకున్నారు.ఖ‌మ్మంప‌ట్ట‌ణానికిమునుపెన్న‌డూరాన‌న్ని నిధులు తీసుకొచ్చారు. ఐటీ హ‌బ్, కొత్త బ‌స్టాండ్, నాన్ వెజ్ మార్కెట్, దంస‌లాపురం రైల్వే బ్రిడ్జి, గోళ్ల‌పాడుచాన‌ల్ అభివృద్ది, స‌హా అనేక ప‌నులుపురోగ‌తి లో కూడా ఉన్నాయి. నిన్న‌మొన్న‌టివ‌ర‌కు మంచి పేరు సంపాదించిన అజ‌య్కుమార్ తాజాగా లేని పోని వివాదాలు నెత్తినేసుకొని అభాసుపాలు అతున్న‌ట్టు అధికార పార్టీ నేత‌లు చెప్పుకుంటున్నారు. ఆయ‌న చుట్టూ ఉన్న వివాస్ప‌దవ్య‌క్తులేఅజ‌య్ కుమార్ ఓట‌మికికార‌ణంఅవుతార‌నిపార్టీ కార్యకర్తలు చెబుతున్నారు. ఆయ‌న‘కోట‌రీ’లో ఉన్న అన్ని ర‌కాలవ్య‌క్తుల్లోవివాదస్పుదులే ఎక్కువ‌. వారి వివాదాల‌ను ఎమ్మెల్యే అజ‌య్త‌ల‌కురుద్దుతున్నార‌ని తెలుస్తోంది. కోటరీలోని పోలీసు, రాజ‌కీయం, అంతరంగీకులు ఇలా ఎవరైనా అజ‌య్ కు మేలు కంటేన‌ష్టం ఎక్కువ చేస్తున్న‌ట్టుచ‌ర్చన‌డుస్తోంది. దీనికి తోడు సొంత పార్టీ నాయ‌కులైన మంత్రి తుమ్మ‌ల‌, ఎంపిపొంగులేటి తో ఆయ‌న‌కుపొస‌గ‌డంలేద‌న్నది బహిరంగ రహస్యం. ప్రాభవంకోల్పోయిన ఓ క‌మ్యూనిస్టు పార్టీకి పువ్వాడ ప్రాధాన్యం ఇస్తున్నారు.ఈ పరిణామాలతో ప్ర‌త్య‌ర్థి కాంగ్రెస్ పార్టీ బ‌లంగా పావులు క‌దుపుతోంది. కాంగ్రెస్ లో’ ఫైర్ బ్రాండ్’ గా ముద్ర‌ప‌డిన రేణుకా చౌద‌రి ఈసారి ఖ‌మ్మం అసెంబ్లీ బ‌రిలోదిగుతార‌ని ప్రచారం సాగుతోంది.లేదా ఖమ్మం లోక్ సభకు అయినా ఆమె పోటీ ఖాయమన్న ప్రచారం ఉధృతంగా సాగుతున్నది.గ‌తంలో రేణుక చౌద‌రి ద్వారానే అజ‌య్ కుమార్ కు కాంగ్రెస్ టికెట్ వ‌చ్చింద‌ని, ఆమె ప‌రిచ‌యాలేఅజ‌య్ ను గెలిపించాయ‌ని ఆమె వ‌ర్గీయులు చెబుతుంటారు. ఈ నేప‌థ్యంలో ఒకే సామాజిక‌వ‌ర్గం, బ‌ల‌మైననాయ‌కురాలు, విస్తృత‌మైనప‌రిచ‌యాలు ఉన్న రేణుక చౌద‌రిఖ‌మ్మంబ‌రిలో ఉంటే అజ‌య్కుమార్ గెలుపు క‌ష్ట‌మేనన్న అభిప్రాయం నెలకొంటున్నది. జిల్లాలోనే సంప్ర‌దాయ‌ ఓటు బ్యాంకు ఉన్న కాంగ్రెస్ ఇటు పాలేరు, అటు ఖ‌మ్మం రెండో చోట్ల గెలుపే ల‌క్ష్యంగాప‌నిచేస్తుంద‌ని ఒక అంచ‌నా. కానీ గ్రూపులు, ఆదిప‌త్యపోరుతో నిత్యం స‌త‌మ‌త‌మ‌య్యే కాంగ్రెస్ పార్టీలో నాయకుల మధ్య ఐక్యత సాధ్యమేనా అనే సందేహాలున్నవి.