కాంగ్రెస్, టిడిపి, టిఆర్ఎస్ మూడు కుటుంబ పార్టీలు.

బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర రావు.
హైదరాబాద్:
కాంగ్రెస్, టీఆర్ఎస్,టిడిపి పార్టీలు కుటుంబ పార్టీలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరావు విమర్శించారు.
తెలుగోని సత్తా కర్నాటకలో చూపిస్తామని ఇద్దరు ముఖ్యమంత్రులు గొప్పలు చెప్పారని ఆచరణలో విఫలమయ్యారని అన్నారు. ఈ రెండు పార్టీలు కాంగ్రెస్ జేబులో సంస్థలని అన్నారు. తెలంగాణ లో బీజేపీ మినహా  అన్ని పార్టీలు మజ్లీస్ కు మొకరిల్లే పార్టీలేనని ఆరోపించారు. దక్షిణాదిలో కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయాలు చేసే ఏకైక పార్టీ బీజేపీ మాత్రమే నన్నారు.ఓడినా, గెలిచినా ప్రజలకోసం నిలబడే పార్టీ బీజేపీ మాత్రమే నని తెలిపారు. కర్ణాటకలో వచ్చిన విజయమే భవిష్యత్తులో తెలుగు రాష్ట్రాల్లో  ఫలితాలు వస్తాయన్నారు. తెలంగాణలో రాజకీయాల్లో మార్పు రావలంటే కుటుంబరాజకీయలకు స్వస్తి పలకాలని మురళీధరరావు అన్నారు.