కాంగ్రెస్ తో కలిసి ఫ్రంట్ ఏర్పాటు చేస్తా.-చంద్రబాబు.

ప్రకాశ్, న్యూఢిల్లీ:

కాంగ్రెస్, టీడీపీల మధ్య పెద్దగా సైద్ధాంతిక విభేదాలు లేవన్నారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. ఆర్థిక సంస్కరణలు, అభివృద్ధి, సంక్షేమం, సెక్యులర్ సిద్ధాంతాల విషయంలో రెండు పార్టీలు ఒకే విధంగా నడుస్తాయని ‘ఎకనామిక్ టైమ్స్’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రబాబు అభిప్రాయపడ్డారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షంచేందుకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏని అడ్డుకోవాల్సి ఉందన్నారు. ఇందుకోసం జాతీయ స్థాయిలో ప్రతిపక్ష పార్టీలన్నీ సంఘటితం కావాలని చెప్పారు. ఎన్నికల ముందు కానీ తర్వాత కానీ ఒక కూటమి ఏర్పడవచ్చని తెలిపారు. కాంగ్రెస్ లేకుండా ఎన్డీఏని ఎదుర్కొనే కూటమి ఏర్పాటు సాధ్యం కాదని చంద్రబాబు అన్నారు. ఎన్డీఏకి వ్యతిరేకంగా జాతీయ కూటమి ఏర్పాటుకు టీడీపీ కీలక పాత్ర పోషిస్తుందని బాబు స్పష్టం చేశారు.