కాంగ్రెస్ తో టచ్ లో టీఆరెస్ నాయకులు!! మధుయాష్కీ

హైదరాబాద్:

మాజీ డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్సీలు తమతో టచ్‌లో ఉన్నారని కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్ తెలిపారు. వీళ్లంతా రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్నారని ఆయన చెప్పారు. టీఆర్ఎస్‌లో వాళ్లకు గౌరవం లేనందునే కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.ఈ నెల 20న రాహుల్ గాంధీ తెలంగాణలో ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెడతారని, చాలా సభల్లో ప్రసంగిస్తారని మధుయాష్కీ చెప్పారు. గద్దర్ మద్దతు ఇవ్వటంతో తమ బలం పెరుగుతోందని, గద్దర్‌కు ఒక్క సీటు కాదు.. వంద సీట్లు గెలిపించే సత్తా ఉందన్నారు. టీఆర్ఎస్ నేతలు గద్దర్‌పై అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఓయూ సహా తెలంగాణ విద్యార్థుల రాజకీయ, ఉద్యోగ భద్రతకు రాహుల్ గాంధీ భరోసాగా ఉంటారని అన్నారు. తాను ఎంపీగానే పోటీ చేస్తానని మధుయాష్కీ స్పష్టం చేశారు.