కాంగ్రెస్ సీనియర్ నేత హఠాన్మరణం

న్యూఢిల్లీ:

కాంగ్రెస్ సీనియర్ నేత ఆర్కే థావన్ సోమవారంనాడిక్కడ కన్నుమూశారు. ఆయన వయస్సు 81 సంవత్సరాలు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి అత్యంత సన్నిహితుడుగా, ఆమె పర్సనల్ సెక్రటరీగా పనిచేసిన థావన్, 1994లో ఆమె హత్య కేసులోనూ కీలక సాక్షిగా ఉన్నారు. నావికాదళ మాజీ అధిపతిగా థావన్ సేవలందించారు. పార్టీ సిద్ధాంతాలకు అంకితమై, తుది శ్వాస వరకూ అవిశ్రాంతగా పనిచేసిన థావన్ సేవలు చిరస్మరణీయమని కాంగ్రెస్ ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా గుర్తుచేసుకున్నారు.