కారు బోల్తా: ఒకరి మృతి.

 

పుల్కల్:
మెదక్ జిల్లాలోని పుల్కల్ మండలం చౌతాకూర్ వద్ద ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. కారు బోల్తా పడడంతో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ ప్రమాదంలో మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి సహాయక చర్యలు చేపట్టారు. మృతుడు జోగిపేటకు చెందిన శివకుమార్(38) గా గుర్తించారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం పుల్కల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.