కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీరింగ్ అద్భుతం,కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన కవులు, రచయతల బృందం.

కాళేశ్వరం;
మంత్రి హరీష్ రావు దీక్షా పరుడు.

—————————————-

తెలంగాణ వికాస‌‌సమితి ఆధ్వర్యంలో నిన్న కవులు రచయితల బృందం కాళేశ్వరం ప్రాజెక్టునుసందర్షించింది. రెండు బస్సు ల్లో 70 మంది కవులు, రచయితలు కాళేశ్వరం బయలు దేరి వెళ్లారు. ఈ బృందానికి ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేకాధికారి దేశపతి శ్రీనివాస్, తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యకులు నందిని సిద్ధారెడ్డి నేతృత్వం వహించారు. కాళేశ్వరం యాత్రకు నీటి పారుదల శాఖ ప్రత్యేకాధికారి శ్రీధర్ దేశ్ పాండే సమన్వయ కర్తగా వ్యవహరించారు. కాళేళ్వరం ప్రాజెక్టుకు బయలు దేరే సమయంలోనే కవులకు, రచయితలకు ప్రాజెక్టు కు సబంధించిన సమాచార ప్రతిని కవులకు, రచయితలకు అందజేశారు.ముందుగా వారు మేడిగడ్డ ప్రాజెక్టును సందర్షించారు. అక్కడి ఇంజనీర్లు ప్రాజెక్టు వివరాలు మ్యాపుల సాయంతో వివరించారు. అనంతరం మెడిగడ్డ బ్యారేజీ పనుల పురోగతిని స్వయంగా పరిశీలించారు. అక్కడి నుంచి కన్నెపల్లి పంప్ హౌస్, సర్జికల్ పూల్ పనులను పరిశీలించారు. ఈ ప్రాజెక్టులో గోదావరి నీళ్లను వంద మీటరేల ఎత్తు నుంచి 620 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్ చేయడం గొప్ప విషయమని ఇంజనీర్లు వివరించారు. అక్కడి నుంచి అన్నారం బ్యారేజీ పనులను కవులు, రచయితల బృందం పరిశీలించింది.
14 నెలల‌కాలంలోనే బ్యారేజీ నిర్మాణ పనులు‌ జరిగిన తీరుకు వీరంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ బ్యారేజి నుంచి ప్రతీ రోజు 2‌టీఎంసీల నీటిని ఎత్తిపోయనున్నట్లు ప్రాజెక్టు ఇంజనీర్లు తెలిపారు. అన్నారం బ్యారేజీ పిల్లర్ల నిర్మాణం కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి నట్లు చెప్పారు. రానున్న రెండు మూడు నెలల్లో అన్నారం బ్యారేజీ పనులు పూర్తి చేసేందుకు తామంతా శ్రమిస్తున్నట్లు ఇంజనీర్లు తెలిపారు. ఈ బ్యారేజీకి ఏర్పాటు చేస్తోన్న 12అడుగుల గేట్ల పనులను కవులు, రచయితల బృందం పరిశీలించింది. అనంతరం వారంతా ప్రాకేజీ -6 పనులను పరిశీలించారు. ఇందులో భాగంగా ధర్మారంలో చేపట్టిన టన్నెల్ నిర్మాణ పనులను పరిశీలించారు. టన్నెల్ లోకి బస్సు సైతం వెళ్లడంతో వారంతా‌ సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. 160 మీటర్ల ఎత్తున కొండ గర్భాన్ని చీల్చి ఎల్ ఆకారంలో నిర్మిస్తోన్న సర్జికల్ పూల్ నిర్మాణం పనులను చూసి అబ్బురపడ్డారు. పంపు స్టేషన్లు, పవర్ స్టేషన్ ను సందర్షించారు. ఒక్కో పంపు స్టేషన్ లక్ష హర్స్ పవర్ ను మించి ఉండటం, గ్యాస్ ఇన్సులేటెడ్ పవర్ స్టేషను ఏర్పాటు వంటివి కవులు, రచయిత ల బృందాన్ని ఆశ్చర్యచకితులను చేసింది.అనంతరం అర్థరాత్రి రచయిత లు, కవులు కాళేశ్వరం ప్రాజెక్టు అనుభవాలను అక్కడ మీడియాతో పంచుకున్నారు.

————————————–
ఇంజనీరింగ్ అద్భుతం కాళేశ్వరం ‌ – దేశపతి‌ శ్రీనివాస్.
—————————————
కాళేశ్వరం ఇంజీనింగ్ అద్భుతాల్లో ఒకటని సీఎం కార్యాలయ ప్రత్యేక అధికారి దేశపతి శ్రీనివాస్ కొనియాడారు. సీఎం కేసీఆర్ దార్శనికత వల్లే ఇది సాధ్యమయిందన్నారు. భారీ వ్యయంతో కూడుకున్న పని అయినా రైతు పక్షపాతంతో ప్రభుత్వం ఈ ప్రాజెక్టు పనికి పూనుకుందన్నారు. రానున్న కొద్ది కాలంలోనే తెలంగాణ సస్యశ్యామలం కానుందని చెప్పారు. హరీష్ రావు వంటి కార్యదీక్షాపరుడు, అంకితభావం గల వ్యక్తి నీటి పారుదల శాఖ మంత్రిగా ఉండటం వల్లే పనులు తక్కువ కాలంలో వేగంగా జరుగుతున్నాయని కితాబిచ్చారు.

కాళేశ్వరంలో విజ్ఞానం దాగుంది -నందిని సిద్దారెడ్డి.
—————————————-
తెలంగాణ సాధన ఎంత ఆనందాన్ని నింపిందో..కాళేశ్వరం ప్రాజెక్టు అంతే ఆనందాన్ని నింపిందని తెలంగాణ ‌సాహిత్య అకాడమీ అధ్యక్షులు నందిని సిద్ధారెడ్డి చెెప్పారు.కాళేశ్వరం ప్రాజెక్టులో అపారమైన ఇంజనీరింగ్ విజ్ఞానం దాగుందన్నారు.
ఉద్యమంలో నీళ్లు అనే అంశం కీలక పాత్రపోషించిందని‌ చెప్పారు. అందుకే తెలంగాణ సిద్ధించిన వెంటనే సీఎం కేసీఆర్ కోటి ఎకరాలకు నీరివ్వాలని‌ సంకల్పించి నట్లు చెప్పారు. కేసీఆర్ రీ డిజైన్ ఇంజనీర్ గా మారారని కొనియాడారు.

ప్రాజెక్టు ‌సందర్షన గొప్ప అనుభూతి – తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఎస్వీ సత్య నారాయణ.
—————————————-
కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన తన జీవితం లో‌గొప్ప అనుభూతని తెలుగు విశ్వవిద్యాలయం ఉప కులపతి ఎస్వీ సత్యనారాయణ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేతల ప్రభుత్వమని ప్రాజెక్టు చూసిన వారికి అర్థమవుతుందన్నారు. వెల వెల బోతున్న గోదారిని పునరుజ్జీవింపజేయడమన్న ఆయన ఇదీ ఒక రకంగా నదుల అను‌సంధానమేనన్నారు.

కాళేశ్వరం రైతు లకు సిరులు పండిస్తుంది. అయాచితం శ్రీధర్
————————————-
కాళేశ్వరం ప్రాజెక్టు రైతులకు ‌సిరులు పండిస్తుందని తెలంగాణ గ్రంథాలయ పరిషత్ ఛైర్మన్ అయాచితం శ్రీధర్ చెప్పారు. వందల కిలోమీటర్ల వరకు గోదావరి కలకలలాడుతుందని చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా 36 లక్షల ఎకరాల భూమిని ఈ ప్రాజెక్టు ద్వారా తడపవచ్చన్నారు.
వీరితో పాటు జూలూరి గౌరీ శంకర్, మామిడి హరికృష్ణ, ఎనుగు నరసింహారెడ్డి లు సైతం కాళేశ్వరం ప్రాజెక్టు పై ప్రసంశల వర్షం కురిపించారు.కాళేశ్వరం ప్రాజెక్టు సందర్షించిన కవులు, రచయితల బృందంలో సుంకిరెడ్డి నారాయణరెడ్డి, సంగిశెట్టి‌శీనివాస్ , నాళేశ్వరం శంకరం, వఝుల శివకుమార్, సబ్బని లక్ష్మి నారాయణ, ‌ఎస్.రఘు,‌నాగిళ్ల రామస్వామి, పొట్లపల్లి శ్రీనివాస రావు, కోదూరు విజయకుమార్, పగడాల నాగేందర్, మెర్సీ మార్గరెట్, కేపీ అశోక్ కుమార్ , తదితర రచయితలు, కవులు‌ పాల్గొన్నారు.