కాళేశ్వరం ప్రాజెక్టు పనులు వేగం పెంచాలి. -మంత్రి హరీష్ రావు.

కాళేశ్వరం:
కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పురోగతిని మంత్రి హరీష్ రావు మరో క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఇవాళ ఆయన వర్షాన్ని ‌సైతం లెక్క చేయకుండా , బురదలో ప్రాజెక్ట్ పనులను పరిశీలించారు.
కన్నెపల్లి పంప్ హౌస్ నిర్మాణ పనుల సమీక్ష నిర్వహించారు. నాలుగు పంప్ హౌస్ ల నిర్మాణాన్ని జులై 15 కల్లా పూర్తి ‌చేయాలని ఇంజనీర్లను, ‌గుత్తేదారులను ఆదేశించారు. ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరం ప్రాజెక్టులో ముఖ్యమైన మైలు రాయని , ఇది పూర్తి చేసేందుకు చొరవ చూపాలన్నారు. గ్రావిటీ‌కెనాల్ లో 29 నిర్మాణాల్లో, 24 నిర్మాణాలు ప్రాముఖ్యమైనవి చెప్పారు. ఇందులో 23 దాదాపు పూర్తి కావొస్తున్నాయవి ఇంజనీర్లు తెలిపారు. మిగతా నిర్మాణాలు వేగంగా పూర్తి చేయాలన్నారు. ఇందులో చివరి నిర్మాణ మయిన పెద్దవాగు నీటిని దిగువకు మళ్లించే అండర్ టన్నెల్ పనులను పరిశీలించారు. ఆ పనుల పురోగతిని సమీక్షించారు. ఈ నిర్మాణంలో అవసరమైన బూమర్లు ఐదుకు పెంచాలని, సెంట్రింగ్ కార్మికులను మరో 200 మందిని పెంచాలన్నారు. కార్మికుల కొరత ఉందని ఇంజనీర్లు, గుత్తేదారులు చెప్పారు. దీంతో మంత్రి హరీష్ రావు రాష్ట్రంలోని నాలుగు‌ ఏజెన్సీ లతో మాట్లాడి మరో 200 మంది కార్మికులను రేపు సాయింత్రంలోగా పంపాలని ఫోన్లో కోరారు. అందుకు నాలుగు‌‌ ఏజెన్సీల ‌గుత్తేదారులు అంగీకరించారు. వారికి అవసరమైన సదుపాయాలు కల్పించాలని, మూడు షిఫ్టుల్లో పని చేయించాలని సైట్ ఇంజనీర్లను ఆదేశించారు. ప్రతీ రోజు వాట్స్ ప్ లో మూడు షిఫ్టుల్లో పని చేసే‌దృశ్యాలను , చిత్రాలను వాట్సప్ ద్వారా పంపాలని ఆదేశించారు. అనంతరం అన్నారం బ్యారేజీ పనులను పరిశీలించారు. బ్యారేజీ గెట్లు బిగింపు పనులను అడిగి‌ తెలుసుకున్నారు. 22 గేట్లకు గాను 15 గేట్లు బిగించామని ఇంజనీర్లు తెలపగా‌వెంటనే వాటిని ట్రయల్ రన్ ప్రారంభించాలని ఆదేశించారు. బ్యారేజీ పై నిర్మిస్తున్న రహదారి గడ్డర్ల పురోగతిని పరిశీలించారు. 495 గడ్డర్లకు గాను 165 గడ్డర్లను ఏ ర్పాటు చేసినట్లు ఇంజనీర్లు మంత్రికి తెలిపారు. మరి కొన్ని క్రేన్లు వినియోగించి వర్షాలు పెరిగేలోగా పనులు పూర్తి‌చేయలన్నారు. పనుల నాణ్యతతో అనుకున్న లక్ష్యాన్ని సాధించేలా సమాంతరంగా పనులు చేయాలని సూచించారు.