‘కాషాయ ఉగ్రవాదం’లో నిజమెంత?

మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ ‘కాషాయ ఉగ్రవాదం’ అనే పదాన్ని ప్రయోగించాడు. కాంగ్రెస్ నాయకులు పి.చిదంబరం, సుశీల్‌కుమార్ షిండే ఈ పదానికి విస్తృత ప్రచారం ఇచ్చారు. నీలం రంగు బిఎస్‌పికి, అరుణ వర్ణం కమ్యూనిస్టులకు, కాషాయం భాజపాకు చిహ్నాలు. భారతీయ ఋషులు కాషాయ వస్త్రాలు ధరించేవారు. కాషాయం త్యాగానికి సంకేతం. నేటికీ ప్రతి హిందూ దేవాలయం మీద కాషాయ జెండా ఎగురుతూ ఉంటుంది.
మన దేశంలో 1947 నాటికి 40 కోట్ల జనాభా ఉండేది. ఇప్పుడు ఆ సంఖ్య 130 కోట్లు దాటింది. పాకిస్తాన్‌లోని లాహోరు వంటి ప్రాంతాలల్లో 14 శాతం హిందువులు ఉండేవారు. ఇప్పుడు ఒక్కడూ లేడు. ఇదే పరిస్థితి బంగ్లాదేశ్‌లోనూ ఉంది. ఇక, ముస్లింలలో షియా, సున్నీ, సూఫీ అనే మూడు వర్గాలున్నాయి. సున్నీలు మతపరమైన విద్వేషంతో షియాలను, సూఫీలను, హిందువులను, యూదులను, క్రైస్తవులను, కుర్దులను నిర్మూలిస్తున్నారు. ఐసిస్ అనే ఉగ్రవాద సంస్థ హిందువులపై ‘కాఫిర్లు’ (అవిశ్వాసులు) అనే ముద్రవేసి నరసంహారం మొదలుపెట్టింది. వీరు ఇస్లాంలోని సూఫీ వర్గాన్ని కూడా నిర్మూలిస్తున్నారు. హిందువులు ఆలయాలకు వెళతారు. విగ్రహారాధన చేస్తారు. గోపూజ చేస్తారు. పరస్ర్తిని మాతృమూర్తిగా భావిస్తారు. అందుకని ముస్లిములు ఆలయాలను కూల్చారు, విగ్రహాలు ధ్వంసం చేశారు. గోవులను కోశారు. స్త్రీ లపై అత్యాచారాలు చేశారు. తెలంగాణలో పదవ నిజాం ఉస్మాన్ ఆలీఖాన్‌కు మూడువందల మంది భార్యలు. హైదరాబాద్‌లో వీరు నివసించిన ప్రదేశాన్ని ఇప్పటికీ ‘కింగ్‌కోఠి’ అని పిలుస్తారు. జోధ్‌బాయి వంటి రాజపుత్ర స్ర్తిలనందరినీ అక్బరు తన రాజభవనంలో చేర్చుకున్నాడు. దీనిని కమ్యూనిస్టు చరిత్రకారులు ‘మత సామరస్యం’ అని ప్రచారం చేశారు.మన దేశంలో హిందూమత ఉగ్రవాదం ఉంటే నేటికీ 20 కోట్ల మంది ముస్లింలు ఇక్కడ సుఖజీవనం సాగించగలిగేవారా? కోట్ల సంఖ్యలో క్రైస్తవులు చర్చిలకు, సిక్కులు గురుద్వారాలకు వెళ్తారు. హైదరాబాద్‌లో సంఘ రక్షిత మహాధీర అనే ఒక బౌద్ధ సన్యాసి ఉన్నాడు. ఆయన ఆశ్రమం మహేంద్ర హిల్స్‌లో ఉంది. సికిందరాబాద్ సమీపంలో మైత్రీవనం ఉంది. ఉత్తరప్రదేశ్‌లో బౌద్ధుల పుణ్యక్షేత్రాలు పెద్దసంఖ్యలో ఉన్నాయి. హిందువులకు మత సహనం లేకపోతే మాయావతి బహుజన సమాజ్ పార్టీని నడపగలిగేదా? యుపి వంటి హిందూ మత ప్రధాన రాష్ట్రానికి ఆమె సీఎం కాగలిగేదా?
హిందువులకు వారి గురువులు పరమత సహనాన్ని నేర్పుతారు. సర్వధర్మ సమభావనను బోధిస్తారు. సహనమే సంస్కృతి అనే మాట నాటి సర్వేపల్లి రాధాకృష్ణన్ నుంచి నేటి ప్రణబ్‌ముఖర్జీ వరకు బోధించారు. ఇంతకూ సహనమంటే ఏమిటి? యూరపులోని క్రైస్తవ ప్రపంచం సహనంతో జీవించిందా? కాథలిక్కులు, ప్రొటెస్టెంట్లు, జెసూయిట్లు,పోప్‌లు ఎన్నో మత యుద్ధాలు చేశారు. వాటికి సప్తవర్ష సంగ్రామం శతవర్ష సంగ్రామం, వార్స్ ఆఫ్ రోజెస్ వంటి పేర్లున్నాయి. భూమి గుండ్రంగా ఉంది అని గెలీలియో ప్రతిపాదిస్తే- బైబిలుకు విరుద్ధంగా ఉందంటూ అతడిని శిక్షించారు. తమకు నచ్చని మహిళలను మంత్రగత్తెలన్న నెపంతో సజీవంగా తగలబెట్టారు. ఇదేనా జీసస్ బోధించిన మత సహనం?జైషే మహ్మద్, ఇండియన్ ముజాహిద్దీన్, లష్కరే తోయిబా, తాలిబన్, అల్‌ఖైదా, ఐసిస్.. ఇలాంటి నలభై ఉగ్రవాద ఇస్లామిక్ సంస్థలు ప్రపంచవ్యాప్తంగా నరమేధం సృష్టిస్తున్నాయి. ఎందుకంటే- ‘వాహిబ్’ ఖిలాఫత్ సామ్రాజ్య స్థాపన కోసమని చెపుతున్నారు. ‘వాహిబ్’ అంటే అరబ్బీ భాషలో ధ్యానం అని అర్థం. ధ్యానం అంటే సాటి మనుషులను చంపడమా? మన దేశంలో కొన్ని రాజకీయ పార్టీల ధోరణి ఇలాగే ఉంది. 1984లో న్యూఢిల్లీ వీధుల్లో జగదీశ్ టైట్లర్, సజ్జన్ కుమార్ అనే ఇద్దరు సీనియర్ కాంగ్రెసు నాయకులు దాదాపు 4000 మంది సిక్కులు ఊచకోతకు గురయ్యేలా హింసను ప్రేరేపించారు. తాజాగా లష్కరే తోయిబా అనే ఉగ్రవాద సంస్థ- ‘కాంగ్రెస్ నేతలు మన మిత్రులు. వీరితోకలిసి పోరాటం సాగించాలి’ అని బహిరంగ ప్రకటన విడుదల చేశారు. పాలస్తీనా విమోచనాసంస్థ వారు ఇజ్రాయిల్‌ను ప్రపంచ పటం నుండి నిర్మూలించాలని ప్రయత్నిస్తే అలనాడు ప్రధాని ఇందిరాగాంధీ ఇజ్రాయిల్‌కు గుర్తింపు నివ్వలేదు. అంతేగాక యాసిన్ అరాఫత్‌తో దోస్తీ చేసింది. హైదరాబాద్‌లోని పాతబస్తీలో ఐసిస్ రిక్రూట్‌మెంటు సెంటర్ ఉంది. దీని నిర్వాహకులతో కాంగ్రెస్ పార్టీ స్నేహం నెరుపుతోందన్న ఆరోపణలున్నాయి. కేరళలోని ఐసిస్ కేంద్రాల మద్దతుతో అక్కడ కమ్యూనిస్టు ప్రభుత్వాలు నడుస్తున్నాయి. ఇంతకీ ఎవరు ఉగ్రవాదులు? ఎవరిది టెర్రిరిజం?? హిందువుల్లో కర్మసిద్ధాంతం ఉంది. ఎవరు తమకు కీడు చేసినా అంతా ‘ఖర్మ’ అనుకుంటారు. ఎవడైనా తమపై దాడిచేస్తే ‘వాడి పాపానవాడు పోతాడులే’ అని సరిపెట్టుకుంటారు. ఈ రెండూ హిందువుల్లో ప్రధాన బలహీనతలని కొన్ని దశాబ్దాల క్రితమే వీర సావర్కార్ తన గ్రంథం (షష్ట్ధ్యాయం సద్గుణ వికృతి)-లో చెప్పారు. హిందువులు నిద్రిస్తున్నంత కాలం గజనీలు,ఘోరీలు,మాలిక్ కాఫిర్లు, నాదిర్షాలు, మొగలులు చివరకు వ్యాపారం నిమిత్తం వచ్చిన ఈస్టిండియా కంపెనీ వారు మన దేశాన్ని దోచుకున్నారు. ఈమధ్య హిందువులు తమ అంతర్గత విభేదాలను వీడి, సంఘటితంగా ఉండాలనే ఉద్యమం మొదలైంది. దీన్ని భరించలేని కమ్యూనిస్టులు, కాంగ్రెస్ నేతలు ‘కాషాయ ఉగ్రవాదం’ అనే పదాన్ని సృష్టించారు.
శ్రీనగర్‌లో ‘రైజింగ్ కశ్మీర్’ పత్రిక సంపాదకుడు సయ్య ద్ షాజుద్ బుఖారీ. ఇతడు రంజాన్ పవిత్ర మాసంలో నిష్ఠగా ఉపవాస దీక్ష చేసేవాడు. ఆయన ఇఫ్తార్ విందుకు బయలుదేరితే ఉగ్రవాదులు కాల్చిచంపారు. బుఖారీ హిందువుకాదు, రంజాన్ వ్రతదీక్షలో ఉన్నాడు. అలాంటివాడిని ఎందుకు కాల్చి చంపారు? దీనికి కాంగ్రెస్ నేతలు ఏం సమాధానం చెబుతారు? ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా ప్రభుత్వ నేతలు సర్వధర్మ సమాభావనను ప్రతిపాదించారు. రాజకీయ లబ్ధికోసం మోదీ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకే విపక్షాల వారు ‘హిందూ ఉగ్రవాదం’ అంటూ విమర్శలు చేస్తున్నారు. ‘హిందూ టెర్రరిస్టులు’ చేసిన అరాచకాలు ఏమిటో తెలుసా? ముంబయిలో ఒక కళాకారుడి ముఖాన సిరా పూశారట. యూపీలో ఒక పశువుల దొంగపై రాళ్లువేశారట. కశ్మీర్‌లో భారతీయ సైనికులపై రోజూ రాళ్లవర్షం కురిపిస్తున్న ఐసిస్ ఉగ్రవాదులు ‘దైవభక్తులు’. వీరిని కాంగ్రెస్ నేతలు ప్రత్యక్షంగా సమర్థిస్తున్నారు.కేరళలో వందలాది మందిని హత్య చేయించిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ గొప్ప సెక్యులరిస్టు. అనేకమంది సామాజిక కార్యకర్తలను చంపించిన కర్నాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సెక్యులరిస్టు. బెంగాల్‌లో త్రిలోచన్ మెహత్ అనే దళిత యువకుడు బిజెపి కార్యకర్తగా పనిచేశాడని హత్యచేసి చెట్టుకు వ్రేలాడదీసిన మమతా బెనర్జీ మరో సెక్యులరిస్టు. ముస్లింలుగా పుట్టినవారు ముస్లిం అభ్యర్థినే గెలిపించాలని ఖైరానా (యూపీ) లో ప్రచారం చేసి తబుస్సమ్ అనే మహిళను ఎంపీగా గెలిపించినవారు సెక్యులరిస్టులు. ములాయం సింగ్, రాహుల్ గాంధీ, మణిశంకర్ అయ్యర్.. వీరంతా సెక్యులరిస్టులు. హిందువులు ఉగ్రవాదులైతే దేశంలో ఇన్ని లక్షల చర్చిలు, మసీదులు, కమ్యూనిస్టుపార్టీ ఆఫీసులు ఉండగలిగేవా? స్టాలిన్ అధికారంలోకి రాగానే మాస్కోలో చర్చిలను నేలమట్టం చేయించాడు. మావో అధికారంలోకి రాగానే టిబెట్‌లో ఆరులక్షల బౌద్ధవిహారాలు నేలమట్టం చేశారు. మన దేశంలో అన్ని మతాల సిద్ధాంతాలను, సంప్రదాయాలను క్షుణ్ణంగా విశే్లషిస్తే ఎవరు ఉగ్రవాదులు? ఎవరు సాధుశీలురు? అన్న విషయం అవగతమవుతుంది. వోటుబ్యాంకు రాజకీయాలతో మైనారిటీలను ప్రసన్నం చేసుకునేందుకే కాంగ్రెస్, కమ్యూనిస్టు, ఇతర విపక్ష పార్టీల నేతలు ‘కాషాయ ఉగ్రవాదం’ అంటూ అసత్యాలను ప్రచారం చేస్తున్నారు. ఈ విష ప్రచారాన్ని అడ్డుకునే ఐక్యత హిందువుల్లో ఉందా?

-ప్రొ. ముదిగొండ శివప్రసాద్.