‘కింగ్ ఫిషర్’ కోసం కలెక్టర్ కు మద్యం ప్రియుల ఫిర్యాదు.

జగిత్యాల:
ఇదొక వింత ఫిర్యాదు. బార్లలో ‘కింగ్ ఫిషర్’ బీరు అమ్మడం లేదని, ఆ బీరును తమకు అందుబాటులో తీసుకు రావాలని మద్యం ప్రియుడు ఒకరు జిల్లా కలెక్టర్ కు ‘ప్రజావాణి’ లో విజ్ఞప్తి చేశారు. జగిత్యాల పట్టణ ప్రాంతాల్లో బార్ల యజమానులు సిండికేట్ గా మారి కింగ్ ఫిషర్ కు బదులుగా నాసిరకం బీర్లను అమ్ముతున్నట్టు ఫిర్యాదు చేశారు. వెంటనే చర్యలు తీసుకోవాలని, మద్యం ప్రియులకు కింగ్ ఫిషర్ బ్రాండ్ ఎంతో ఇష్టమైనదని ఆ వినతి పత్రంలో తెలిపారు.