‘కిలి మంజారో’ పర్వతాన్ని అధిరోహించిన పాలమూరు డాక్టర్.

హైదరాబాద్:

సుశ్రుత ప్రజా వైద్యశాల ఎం.డి. డాక్టర్ మధుసూదన్ రెడ్డి ప్రపంచ ప్రసిద్ధ కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి చరిత్ర సృష్టించారు. భారత కాలమానం ప్రకారం సోమవారం ఆయన ఈ రికార్డును సృష్టించారు. ఆక్సిజన్ లెవెల్స్ పూర్తిగా పడిపోయిన పరిస్థితుల్లో ఐదువేల తొమ్మిది వందల మీటర్లు ఎత్తున్న ఈ పర్వతాన్ని అధిరోహించడం అత్యంత సాహసంతో కూడిన పని. ఎవరెస్ట్ శిఖరం కంటే భిన్న వాతావరణ పరిస్థితులు కలిగిన ఈ శిఖరాన్ని అధిరోహించడం అత్యంత కఠినతరమైన పని అని పర్వతారోహకులు చెబుతుంటారు. ఇంతటి అరుదైన ఘనతను సాధించిన డాక్టర్ మధుసూదన్ రెడ్డి ని పాలమూరు ప్రజలు ప్రశంసిస్తున్నారు.