కులంకార్డు – పెళ్లి కార్డుకు అడ్డు.

శేఖర్,నల్లగొండ:

మిర్యాలగూడ ప్రేమజంటలో అమృత భర్త ప్రణయ్ ని హత్య చేయడంతో అమృత తండ్రి ఏం సాధించాడు? కులం పరువు పేరుతో కూతురు ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రణయ్ ని అమృత తండ్రి మారుతీరావ్ దారుణంగా కిరాతకంగా హత్య చేయించాడు. కూతురు ప్రేమించిన వాడిని తన కళ్ల ముందే నరికించి కూతురినీ మానసికంగా చంపేశాడు. అప్పటికే అమృత కడుపుతో ఉంది, కళ్ల ముందే భర్త హత్య, ఇప్పుడు హత్య చేయించిన తండ్రి జైలుకు వెళ్తాడు. ఇక ఏం సుఖం ఆ కుటుంబానికి.. క్షణికావేశం అనేక అనర్థాలకు దారితీస్తది. అమృత ది వైశ్య కమ్యూనిటీ, ప్రణయ్ ది Dalit కమ్యూనిటీ.. ప్రేమించే సమయంలో ఇద్దరికీ కులం గురించి ఆలోచించి ప్రేమించరు. అలా అలోచించి ప్రేమిస్తే అది ప్రేమే కాదు. ఇద్దరి మధ్య అకర్షణకి కులం తెలియదు.. ఆడ మగ అంతే తేడా.. సరే తండ్రి తన బిడ్డ కి తన స్థాయికి తగ్గట్టు పెళ్లి చేయాలనుకుంటాడు తప్పు లేదు.. చిన్నప్పటి నుంచి కూతురిపై ఆశలు పెట్టుకుంటాడు. ఏ ఎన్నారైకో, ఏ పారిశ్రామిక వేత్త కొడుకుకో తన స్థాయి కి తగ్గట్టు పెళ్లి చేయాలనుకుంటాడు. కానీ ఇంతలో అమ్మాయి అప్పటికే చదువుకునే రోజుల నుంచే ఒక అబ్బాయిని ప్రేమించాను తననే చేసుకుంటాను అని కుటుంబం ముందుకు వస్తుంది. ఇది ఆ తల్లిదండ్రులకు నచ్చదు, అసలు కూతురు ప్రేమించిన వాడి గురించి ఏమీ ఆలోచించరు.. మొండిగా ఒకటే పట్టుకుంటారు, నువ్వు ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవద్దు అని. ఇదేం న్యాయం, ఆ అమ్నాయి ఒక అబ్బాయి ని ప్రేమించింది తననే కోరుకుంది, అప్పుడు తల్లిదండ్రులు వాళ్ల ప్రేమని పరీక్షించాలి కానీ నరికేయవద్దు. క్షణికావేశానికి లోనై మరీ ఇలా హత్యలు ఆత్మహత్యలకి పాల్పడితే ఎలా?? ఇప్పుడు అమృత పరిస్థితి ఏంటి? ప్రేమించిన వాడు పోయాడు, కడుపు లో‌బిడ్డ, కసాయి తండ్రి( కూతురి మీద ప్రేమ ఉంటే కూతురి బాగు కోరే వాడు అందుకే కసాయి తండ్రి అయ్యాడు). మానసికంగా కూతురిని చంపుకున్నాడు. కొందరికి డబ్బు ఉంటే ప్రేమ దక్కదు. కొందరికి ప్రేమ ఉంటే డబ్బు ఉండదు. కొందరికి రెండూ ఉన్నా కులం కార్డు పెళ్లి కార్డుకు అడ్డుగా మారుతున్నది.