కులవృత్తులతోనే గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ బలోపేతం. – మంత్రి తలసాని.

వనపర్తి:
రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలనేది తెలంగాణ ప్రభుత్వ లక్ష్యంగా మంత్రి వివరించారు.
కులవృత్తులను ప్రోత్సహించడం ద్వారా గ్రామీణ ఆర్దిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు అనేక కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతుందని మంత్రి చెప్పారు.5 వేల కోట్ల ఖర్చుతో గొర్రెల పంపిణీ చేస్తున్నామని తెలిపారు. మత్స్యకారుల అభివృద్ధికి ఈ సంవత్సరం 81 కోట్ల ఉచితంగా చేప పిల్లల పంపిణీ చేస్తున్నామని చెప్పారు.వనపర్తి నుండే చేప పిల్లల పంపిణీ ని ప్రారంభించామని మంత్రి చెప్పారు.మత్స్యకారులకు సబ్సిడీపై వాహనాలు, పరికరాలు పంపిణీ చేస్తున్నామని ఆయన తెలియజేశారు.వనపర్తి లోని లక్ష్మీ కృష్ణ ఫంక్షన్ హాల్ లో జరిగిన మత్స్య కారులు, గొర్రెల పెంపకందారుల సమావేశంలో పశుసంవర్ధక, మత్స్య శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.