కులవ్రుత్తులను అవమానిస్తున్న విపక్షాలు. గ్రామీణ అర్దికవ్యవస్తను పరిపుష్టం చేస్తున్నాం.- మంత్రి జగదీష్ రెడ్డి.

నల్లగొండ:
విపక్షాలు రాష్టంలో కులవ్రుత్తులను అవమానించేవిధంగా ప్రవర్తిస్తున్నాయని రాష్ట్ర విద్యుత్ యస్.సి అభివృద్ధి శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మండిపడ్డారు. గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను పరిపుష్టం చెయ్యడానికే ముఖ్యమంత్రి కేసిఆర్ ఈ తరహ ప్రణాళికలు రూపొందించారని ఆయన చెప్పారు. బుదవారం ఉదయం నల్గొండ జిల్లా కేంద్రంలో నల్గొండ,రంగారెడ్డి జిల్లాల పాల ఉత్పత్తిదారుల సమాఖ్యా అధ్వర్యంలో ఏర్పాటు చేసిన మేలుజాతి పశువుల ప్రదర్శనను ఆయన ప్రారంబించారు. అనంతరం జరిగిన పాడి రైతుల అవగాహన సదస్సులో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణా రైతాంగం పట్టుదల చారిత్రత్మక మైనదని అభివర్ణించారు.
రాష్ట్ర రాజధానికి రోజువారీ అవసరమయ్యే మాంసం 5 నుండి 6 లోడ్లు పడుతుందని అంచనా వేసిన ముఖ్యమంత్రి కెసిఆర్ ఇక్కడికి అవసరమయ్యే మాంసాన్ని ఇక్కడే తయారుచేసుకునేవిధంగా గొర్రెల పెంపకాన్ని ప్రారంబిస్తీ విపక్షాలు అవాకులు చెవాకులు పేలుతున్నారని ఆయన విరుచకపడ్డారు. ఇప్పటికి హైదరాబాద్ కు అవసరమయ్యే కూరగాయలు కుడా దిగిమతి చేసుకునే పరిస్తితి ఉందని ఆయన తెలిపారు.అటువంటి పరిస్తితులనుండి బయట పడేసేందుకే కులవృత్తులకు ప్రోతాహం కల్పిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.వాగులు,వంకలు,చేలిమేలు,ఊటబావులు,మోట బావులు, ఆయిల్ ఇంజన్ లు మొదలు కొని 300 అడుగులు మొదలుకొని 800 అడుగులనుండి పాతాళగంగ ను పైకి తెచ్చి వ్యవసాయం చేస్తున్న ఘనతః ముమ్మాటికి ఇక్కడి రైతంగానికే దక్కుతుందన్నారు.డిమాండ్ పెరగడం ఉత్పత్తులు తగ్గడం వల్లనే పాలాలోను కల్తీ జరుగుతుందని ఆయన అవేదన వ్యక్తం చేశారు. ఒక్క పాలలోనే కాకుండా పాల తరువాత అంతటి ప్రాదాన్యాత ఉన్న నీళ్ళలోను ఉమ్మడి నల్గొండ జిల్లాకు అన్యాయమే జరిగిందన్నారు.గత పాలకుల దౌర్బ్గ్యానికి ఒక మారుమూలా గ్రామంలో పుట్టిన ఫ్లోరిన్ భూతం రెండు లక్షల మందిని కబలించిందని,ముమ్మాటికి ఆ పాపం మూటకట్టుకోవాల్సింది ఇంతకాలం పాలించిన పాలకులేనని ఆయన చెప్పారు.
యావత్ ప్రపంచంలోనే తెలంగాణా రాష్ట్రములోని భూములు అన్ని పంటలకు అనువైనవని అటువంటి నేలను నమ్ముకోవడం ఇక్కడి ప్రజల అదృష్టమన్నారు. తెలంగాణా రాష్ట్ర ప్రజలలో గుణాత్మక మార్పు వచ్చిందని,ఆ మార్పే రేపటి బంగారు తెలంగాణా నిర్మాణానికి పునాది అవుతుందన్నారు. నల్గొండ జిల్లా కలెక్టర్ ఉప్పల్ గౌరవ్ అద్యక్షత వహించిన ఈ సదస్సులో నల్గొండ లోకసభ సభ్యులు గుత్తా సుఖేందర్ రెడ్డి ,రాష్ర్ప అటవీ అభివృద్ధి కార్పోరేషన్ చైర్మెన్ బండా నరేందర్ రెడ్డి,శాసనసభ్యులు గాదారి కిషోర్ కుమార్,వేముల వీరేశం,,భాస్కర్ రావు,నల్గొండ రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల సమాఖ్య అద్యక్ష్యుడు గుత్తా జితేందర్ రెడ్డి ,స్త్రీ శిశు సంక్షేమ శాఖా కోఅర్దినేటర్ మేల్ శరణ్యా రెడ్డి,డి.యఫ్.ఓ శాంతారాం తదితరులు పాల్గొన్నారు .