కుల్ భూషణ్ జాదవ్ కేసు విచారణ.

పాకిస్థాన్ చెరలో మగ్గుతున్న భారతీయుడు కుల్ భూషణ్ జాదవ్ కేసును ఫిబ్రవరి 18-21 మధ్య చేపట్టనున్నట్టు అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజె) ప్రకటించింది. ఫిబ్రవరి 18న మొదటి విడత మౌఖిక వాదనలు వినిపిస్తారు. భారత్ కు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు సమయం కేటాయించారు. తర్వాత రోజు ఇదే సమయంలో పాకిస్థాన్ వాదనలు వింటుంది. మర్నాడు మధ్యాహ్నం 3-4.30 గంటల మధ్య భారత్ రెండో విడత మౌఖిక వాదనలను వినిపించనుంది. ఫిబ్రవరి 21న మధ్యాహ్నం 3-4.30 గంటలకు పాక్ వాదనలు వినిపిస్తుంది. గూఢచర్యం, ఉగ్రవాద చర్యలకు పాల్పడ్డాడనే ఆరోపణలపై పాక్ మిలిటరీ కోర్టు భారతీయుడైన జాదవ్ కి మరణశిక్ష విధించింది. అయితే మే నెలలో భారత్ వినతి మేరకు ఐసీజె అతని శిక్షను నిలిపివేసింది.