‘కూటమి’ కి సి ఎం ఎవరు? -కేటీఆర్.

హైదరాబాద్:

కూటమి అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎవరని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ భవన్ లో మంత్రి కేటీఆర్ సమక్షంలో కామారెడ్డి నియోజకవర్గానికి చెందిన ఆర్య, వైశ్య సంఘం ప్రతినిధులు, ఎల్లారెడ్డి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేతలు టిఆర్ఎస్ లో చేరారు. మాజీ ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్ ,ఏనుగు రవీందర్ రెడ్డి తదితర నేతలు పాల్గొన్నారు. కామారెడ్డి లో షబ్బీర్ ఆలీకి ఈసారి కూడా దారుణమైన ఓటమేనని కేటీఆర్ జోస్యం చెప్పారు. తమ ఓటు కేసీఆర్ కే అని ప్రజలు అంటున్నారని తెలిపారు.

“కాంగ్రెస్ కు ఓటేస్తే డిల్లీకి పోతుంది….టిడిపికి ఓటేస్తే అమరావతికి పోతుంది.కోదండరాం కు ఓటేస్తే అది ఎటుపోతదో తెలియదు. అది ఓ అడ్రస్ లేని సంస్థ.టిడిపి….కాంగ్రెస్ కు తోక పార్టీ అయింది.ఎవరైతే తెలంగాణ బిడ్డలను చంపారో వారితో కోదండరామ్ పొత్తులా.ముష్టి మూడు సీట్ల కోసం కోదండరామ్ ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నాడు.పాలమూరు ప్రాజెక్టుపై చంద్రబాబు కత్తి గట్టాడు.ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కేంద్రానికి 30 లేఖలు రాశారు.

కూటమిని గెలిపించి అమరావతిలో చంద్రబాబు వద్ద తెలంగాణ ఆత్మాభిమానాన్ని తాకట్టుపెట్టాలా….ఆలోచించాలి.కాంగ్రెస్, టీడీపీ లు దివాళా, దగాకోరు రాజకీయం చేస్తున్నారు.
ప్రాజెక్టులు అడ్డుకున్న ద్రోహులు కాంగ్రెస్ నేతలు.అందుకే ప్రజా కోర్ట్ కు పోయాం. తీర్పు మీ చేతుల్లోనే ఉంది.గుడిని…గుడిలో లింగాన్ని మింగే రకం కాంగ్రెస్ నేతలు.కూటమి అధికారంలోకి వస్తే ఎవరు ముఖ్యమంత్రి.?పదవుల కోసం గబ్బిలాల్లా పట్టుకున్న సన్నాసులు కావాలా.?తెలంగాణ స్వాభిమానానికి చిరునామా ఆయిన కేసీఆర్ కావాలా.ఆలోచించండీ.కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి ఏం చేసింది.?100 సీట్లలో విజయం సాధిస్తాం.అగ్రకులాల పేదలకు న్యాయం చేస్తాం.పేదరికమే గీటు రాయిగా పథకాలకు కేసీఆర్ ఆలోచన చేస్తున్నారు” అని కేటీఆర్ అన్నారు.