‘కూటమి’ జాబితా ఎప్పుడు?

హైదరాబాద్:
అసెంబ్లీని రద్దు చేసి 105 నియోజకవర్గాల అభ్య ర్థుల జాబితాను టీఆర్‌ఎస్‌ ప్రకటించింది. మహా కూటమి ఇంకా అభ్యర్థుల జాబిత ఖరారు కాకపోవడంతో కాంగ్రెస్‌, తెలుగుదేశం, టీజేఎస్‌, కమ్యూనిస్టు పార్టీల నాయకులు, కార్యకర్తలు జాబితా కోసం ఎదురు చూస్తున్నారు. మహాకూటమి పార్టీల సీట్లు ఖరారయితే అభ్యర్థుల జాబిత రెడీ అవుతుందని మహాకూటమి ఏ పార్టీకి ఎన్ని సీట్లు కేటాయిస్తుందో.. త్వరగా తేల్చాలని పలువురు నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ జిల్లాలో సీట్లు కోరుకుంటున్నట్లు పార్టీ కార్యకర్తల ద్వారా తెలుస్తోంది. మహబూబ్‌నగర్‌, దేవరకద్ర, వనపర్తి, మక్తల్‌ స్థానాలు జిల్లా పరిధిలోకి వస్తాయి. వీటిలో వనపర్తిలో కాంగ్రెస్‌ పార్టీ తాజామాజీ ఎమ్మె ల్యే చిన్నారెడ్డి ప్రాతినిత్యం వహిస్తున్నారు. కనుక ఆ సీటు నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థే బరిలో ఉండవచ్చుననే చర్చ కొనసాగుతుంది. మహాకూటమి అభ్యర్థులు జాబిత ఖరారు కాకపోవడం వల్ల అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ అధ్యక్షులు ప్రచారంలో దూసుకుపోతు న్నారు. పార్టీల సీట్లు ఖరారు అయిన తర్వాత ప్రచారం జోరుగా సాగనున్నంది. టీడీపీ కోరుకున్న స్థానాలు ఇస్తే మహబూబ్‌నగర్‌ నుంచి ఎర్రశేఖర్‌, వనపర్తి నుంచి రావులు చంద్రశే ఖర్‌రెడ్డి, మక్తల్‌ నుంచి దయాకర్‌రెడ్డి, దేవరకద్ర నుంచి సీతా దయాకర్‌రెడ్డి పోటీ చేస్తారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. మహాకూటమి నుంచి టీజేఎస్‌ మహబూబ్‌నగర్‌ స్థానాన్ని డిమాండ్‌ చేస్తుంది. టీజేఎస్‌ పార్టీ అధినేత కోదండరామ్‌కు రాజేందర్‌రెడ్డి స్నేహితుడుగా ఉండడంతో పాటు ఇటివల నిర్వ హించిన టీజేఎస్‌ సభ కూడా విజయవంతం కావడంతో టీజేఎస్‌ పార్టీ మహబూబ్‌నగర్‌ స్థానాన్ని గట్టిగా కోరుకుంటున్నట్లు తెలుస్తుంది. మహాకూటమిలో సీట్లు కేటాయిం చేటప్పుడు నేతలకు ఇబ్బందులు పడకతప్పదేమో..