‘కూటమి’ విచ్ఛిన్నం కాదు!!

హైదరాబాద్:

మహాకూటమిలో చీలికలు అంటూ వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం. కూటమి విషయంలో ఎలాంటి సందేహాలు అవసరం లేదన్నారు. టీఆర్ఎస్‌ను గద్దె దించడంతో పాటు ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడమే తమ లక్ష్యమని.. కూటమి కొనసాగుతుందన్నారు. అయితే కాంగ్రెస్ ధోరణిపై పరోక్షంగా విమర్శలు చేశారు. పొత్తు ఉందనుకుంటే నిర్ణయాలు త్వరగా జరగాలని.. లేదంటే కూటమి నిలబడడం కష్టమన్నారు. ఇతర భాగస్వామ్య పక్షాలతో ఎలా వ్యవహరించాలో కాంగ్రెస్‌కు స్పష్టత లేదన్నారు. కూటమిలో ఎవరు, ఎలా పనిచేయాలో నిర్ణయించుకోలేకపోతున్నామన్నారు. అయితే నమ్మకం, గౌరవం ఉంటేనే కలిసి వెళ్లగలమని.. కూటమిని నడిపే బాధ్యత కాంగ్రెస్‌దేనని కోదండరాం తేల్చి చెప్పారు.