కేసీఆర్‌ ఢిల్లీ పర్యటన. మెరుపులు-మరకలు.

కెసిఆర్ తన తాజా పర్యటనలోనూ మోడీ‘నొచ్చుకోకుండా’ ఉండే విధంగానే వ్యవహరించారు.డిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పోరాటానికి ఆంధ్రప్రదేశ్, కేరళ,కర్నాటక, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు,విజయన్, కుమారస్వామి, మమతాబెనర్జీ సంఘీభావం ప్రకటించారు. స్వయంగాకేజ్రీవాల్ ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులతోమాట్లాడారు. కొద్ది రోజులుగా డిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కు, ‘ఆప్’ ప్రభుత్వానికి మధ్య నెలకొన్న సంక్షోభాన్ని పరిష్కరించాలని ఆ నలుగురు ముఖ్యమంత్రులు మోడీ కి విజ్ఞప్తిచేశారు.ఈ మేరకు ఒక లేఖ కూడా ఇచ్చారు.ఆ సన్నివేశాలలో కెసిఆర్ కనిపించలేదు. ఆయన వాటికి దూరంగా ఉన్నారు.‘నీతిఆయోగ్’ సమావేశాల సందర్భంగా కూడా చంద్రబాబు, మమత,కుమారస్వామి, పినరయివిజయన్ ప్రధాని మోడీ తో కరచాలనం చేస్తున్న దృశ్యాలుకనిపించాయి. కెసిఆర్తో పాటు మధ్యప్రదేశ్, చత్తీస్గడ్, బీహార్ ముఖ్యమంత్రులు శివరాజ్సింగ్,రమణసింగ్, నితీష్ కుమార్ ప్రధానినికలుస్తున్న మరో దృశ్యం కనిపించింది. బిజెపి, లేదా ఎన్డీఏ భాగస్వాములతోనే కెసిఆర్ కొద్ది సమయం గడిపినట్టు కనిపిస్తున్నది. కేంద్రప్రభుత్వం వ్యవసాయం, ఉపాధి రంగాలకు సంబంధించి నియమించిన ముఖ్యమంత్రుల కమిటీలో తెలంగాణ ముఖ్యమంత్రికి స్థానం దొరకలేదు. ఈ కమిటీలో మధ్యప్రదేశ్, సిక్కిం,బీహార్,గుజరాత్,ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు ఉన్నారు.

హైదరాబాద్;
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ న్యూఢిల్లీ పర్యటనలో‘కాంగ్రెసేతర, బిజెపియేతర’ ఫ్రంట్ కార్యకలాపాల సందడికానరాలేదు. 12 శాతం ముస్లిం రిజర్వేషన్లపై ప్రధానితో ప్రస్తావించినట్టు గానీ, ఒత్తిడి చేసినట్టు గానీ సమాచారంలేదు. సంక్షేమ పథకాల నిధులను రాబట్టే పేరుతో వ్యక్తిగత, రాజకీయ స్వప్రయోజనాల కోసం సీఎం డిల్లీపర్యటన సాగిందంటూ కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తున్నారు. ప్రధాన మంత్రి మోదీతో గతంలో అనేక సందర్భాల్లో రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కెసిఆర్చర్చించారు. మళ్లీ చర్చించడం ఏంటి ? అన్నది కాంగ్రెస్ నాయకుల ప్రశ్న. ప్రధానమంత్రితో రాజకీయ పరమైనలోపాయికారి ఒప్పందం చేసుకున్నారని కూడా కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. నాలుగేళ్లు గడిచినా రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో కేసిఆర్విఫలమయ్యారంటున్నారు. కాగా కెసిఆర్ తన పర్యటనలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీని కలుసుకున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై గంటసేపు చర్చించారు. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు, కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వ నిధులు, రైల్వే ప్రాజెక్టుల నిర్మాణంలో వేగం పెంచడం, సెక్రటేరియట్ నిర్మాణానికి రక్షణ శాఖ స్థలాల కేటాయింపు, వెనుక బడిన జిల్లాల అభివృద్ధి నిధుల విడుదల, ఐఐఎం మంజూరు, ఐటిఐఆర్ కు  నిధులు, కరీంనగర్ లో ఐఐఐటి ఏర్పాటు, కొత్త జిల్లాల్లో జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటు, కొత్త జోనల్ వ్యవస్థకు ఆమోదం తదితర అంశాలపై ప్రధాన మంత్రికి వినతి పత్రాలు సమర్పించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తన దృష్టికి తీసుకొచ్చిన అంశాలపై ప్రధాన మంత్రి సానుకూలంగా స్పందించారని టిఆర్ఎస్ అనుకూల మీడియా ప్రచారం చేసింది. రూ.80వేల కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల 20 జిల్లాల్లో 18 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందడంతో పాటు మంచినీటికి, పారిశ్రామిక అవసరాలకు కూడా నీరు లభిస్తుందని కెసిఆర్ ప్రధానికి తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాధాన్యతను గుర్తించిరూ.20వేల కోట్ల ఆర్థిక సహాయం కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని ఆయన కోరారు. అయితే ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిషన్ కాకతీయ కార్యక్రమానికి 5 వేల కోట్లు ఇవ్వాలని గతంలో చాలా సందర్భాలలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరినా కేంద్రంలో చలనం లేదు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాల ప్రాతిపదికన కొత్త జోనల్ వ్యవస్థను ఏర్పాటు చేసినందున దీనికి అనుగుణంగా రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించాలనిసి.ఎం.కెసిఆర్ ప్రధానికి విజ్ఞప్తి చేశారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ తో పాటు అన్ని రాజ్యాంగ బద్ధ సంస్థల విభజన పూర్తయినా, హైకోర్టు విభజన మాత్రం పూర్తి కాలేదని కెసిఆర్ ప్రధాని దృష్టికి తీసుకు వెళ్లారు. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు అయ్యేలా చూడాలని కోరారు. తెలంగాణలో కొత్త రైల్వే లైన్లు త్వరిత గతిన పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్ లో కొత్త సచివాలయం నిర్మించడానికి బైసన్ పోలో గ్రౌండ్ స్థలాన్ని కేటాయించాలని కోరారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా తెలంగాణలోని 9 వెనుకబడిన జిల్లాల (ఉమ్మడి జిల్లాలు) అభివృద్ధికి ఒక్కో జిల్లాకు ఏడాదికి 50 కోట్ల రూపాయల చొప్పున 450 కోట్ల రూపాయల ఆర్థిక సహకారం అందించాల్సి ఉందన్నారు. హైదరాబాద్ లో ఐటిఐఆర్ ప్రాజెక్టును కేంద్రం ఉపసంహరించుకున్నట్లుగా కేంద్ర ఐటి శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ పేర్కొన్నట్లు పత్రికల్లో చదివామని, ఐదేళ్ల క్రితం మంజూరు చేసిన ప్రాజెక్టును ఉపసంహరించుకోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం విశ్వసనీయత దెబ్బతింటుందని, ఈ ప్రాజెక్టుకు నిధులిచ్చి, హైదరాబాద్ లో ఐటిఐఆర్ ప్రాజెక్టుకుచేయూతనివ్వాలని ముఖ్యమంత్రి కోరారు. ప్రతీ జిల్లాకు ఒక జవహర్ నవోదయ విద్యాలయాన్ని స్థాపించాలని కేంద్ర ప్రభుత్వ విధానం లో భాగంగా ఆదిలాబాద్, నిర్మల్,, మంచిర్యాల, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ రూరల్, జనగామ, మహబూబాబాద్,భూపాలపల్లి, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, మహబూబ్ నగర్, వనపర్తి, జోగులాంబగద్వాల, వికారాబాద్, మేడ్చల్ జిల్లాల్లో కూడా నవోదయ విద్యాసంస్థలను నెలకొల్పాలని కెసిఆర్ కోరారు. గతనాలుగేళ్ళుగా ముఖ్యమంత్రి కెసిఆర్, ప్రధాని మోడీకి పలు కీలక సందర్భాలలో బేషరతు మద్దతు ప్రకటించినా కేంద్రం కనికరించడం లేదన్న విమర్శలు వస్తున్నవి.ఇప్పుడు కూడా కెసిఆర్ తన తాజా పర్యటనలోనూ మోడీ‘నొచ్చుకోకుండా’ ఉండే విధంగానే వ్యవహరించారు.డిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పోరాటానికి ఆంధ్రప్రదేశ్, కేరళ,కర్నాటక, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు,విజయన్, కుమారస్వామి,మమతాబెనర్జీ సంఘీభావం ప్రకటించారు.స్వయంగాకేజ్రీవాల్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతోమాట్లాడారు. కొద్ది రోజులుగా డిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కు, ‘ఆప్’ ప్రభుత్వానికి మధ్య నెలకొన్న సంక్షోభాన్ని పరిష్కరించాలని ఆ నలుగురు ముఖ్యమంత్రులు మోడీ కి విజ్ఞప్తిచేశారు.ఈ మేరకు ఒక లేఖ కూడా ఇచ్చారు. ఆ సన్నివేశాలలో కెసిఆర్ కనిపించలేదు.ఆయన వాటికి దూరంగా ఉన్నారు.‘నీతిఆయోగ్’ సమావేశాల సందర్భంగా కూడా చంద్రబాబు, మమత,కుమారస్వామి, పినరయివిజయన్ ప్రధాని మోడీ తో కరచాలనం చేస్తున్న దృశ్యాలుకనిపించాయి. కెసిఆర్తో పాటు మధ్యప్రదేశ్, చత్తీస్గడ్, బీహార్ ముఖ్యమంత్రులు శివరాజ్సింగ్,రమణసింగ్, నితీష్ కుమార్ ప్రధానినికలుస్తున్న మరో దృశ్యం కనిపించింది. బిజెపి, లేదా ఎన్డీఏ భాగస్వాములతోనే కెసిఆర్ కొద్ది సమయం గడిపినట్టు కనిపిస్తున్నది. అయితేనీతిఆయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రసంగం మిగతా ముఖ్యమంత్రులను,కేంద్రాన్నిఆకట్టుకున్నది. వ్యవసాయరంగంలో తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పులు,రైత్ఘుబందు, రైతుభీమా, సాగునీటి పధకాలనునీతిఆయోగ్ వేదికగా కెసిఆర్ వివరించారు. రాజ్యాంగం ఇచ్చిన‘సమాఖ్యస్ఫూర్తి’ ని ఆయన మరోసారి గుర్తు చేశారు. వ్యవసాయరంగంతో, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకాన్ని అనుసంధానం చేయాలని ఏ.పి.సి.ఎం.చంద్రబాబునాయుడు సూచనలకు కెసిఆర్ గట్టి మద్దతు తెలిపారు. నీతిఆయోగ్ సమావేశం అనంతరం కేంద్రప్రభుత్వం వ్యవసాయం,ఉపాధి రంగాలకు సంబంధించి నియమించిన ముఖ్యమంత్రుల కమిటీలో తెలంగాణ ముఖ్యమంత్రికి స్థానం దొరకలేదు.ఈ కమిటీలో మధ్యప్రదేశ్, సిక్కిం, బీహార్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులుఉన్నారు. సాగుకు ముందు, పంటకోత తర్వాత వ్యవసాయం,ఉపాధిహామీ పధకాలకు సంబంధించి సహకార విధానం పై సిఫారసులు చేయడానికి ముఖ్యమంత్రుల కమిటీని నియమించినట్టు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.కాగాఊహించినట్టుగానే ముఖ్యమంత్రి డిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకోగానే నేరుగా రాజ్ భవన్ వెళ్లి గవర్నర్ నరసింహన్ తో భేటీ అయ్యారు. దాదాపు గంట సేపు ఇరువురు మాట్లాడుకున్నారు. తన డిల్లీ పర్యటన వివరాలను గవర్నర్ కు సి.ఎం.వివరించారు. ప్రధాని మోడీ తో జరిగిన భేటీ సంతృప్తినిచ్చిందని గవర్నర్ కు కెసిఆర్ తెలిపినట్టు సమాచారం.