కెసిఆర్ కు జగన్ ప్రశంస. రాజకీయమర్మం ఏమిటో?

రాజమండ్రి;
వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ను పరోక్షంగా ప్రశంసించారు. దీని వెనక ఉన్న రాజకీయ మర్మాన్ని ఛేదించడానికి విశ్లేషకులుప్రయత్నిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం బహిరంగసభలో జగన్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.“పోలవరంలో6,7 లక్షల క్యూబిక్‌ మీటర్ల పని కూడా చేయకపోయినాతానే అంతా చేశానని చంద్రబాబు బిల్డప్‌లు ఇస్తున్నారు. పొరుగున ఉన్న తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టులో 50లక్షల క్యూబిక్‌ మీటర్ల పనుల్లో దాదాపు 60 శాతం కాంక్రీటు పనులు ఆ సర్కార్‌ చేసింది. కేంద్రంతో లాలూచీ పడి కేంద్రం చేతిలో ప్రత్యేక హోదాను, ఎన్నో ప్రాజెక్టులను చంద్రబాబు తాకట్టుపెట్టారు.పునాదుల దశలోనే పోలవరం ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన ఘనత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుదే. పోలవరం ప్రాజెక్టుకు ఐదుసార్లు పునాదులు తీసి, శంకుస్థాపన చేపించిన చంద్రబాబు గ్రేట్‌ వాల్‌ ఆఫ్‌ చైనా కూడా తానే కట్టాడన్న స్థాయిలో బిల్డప్‌ ఇస్తున్నారు. పోలవరం డబ్బుతో మాత్రం హైదరాబాద్‌లో చంద్రబాబు ఇంద్రభవనం కట్టుకున్నారు’’ అని జగన్ విరుచుకు పడ్డారు.
ప్రజాసంకల్పయాత్ర190వ రోజు పాదయాత్రలో భాగంగ బహిరంగసభలో పాల్గొన్న వైఎస్‌ జగన్‌ నాలుగేళ్ల చంద్రబాబు పాలనపై నిప్పులు చెరిగారు.