కెసిఆర్ ఖబడ్దార్!! శివమెత్తిన డి.కే. అరుణ.

హైదరాబాద్:
టీఆరెస్ అధ్యక్షుడు కేసీఆర్ ను మాజీ మంత్రి డి.కే. అరుణ శనివారం శపించారు.తెలంగాణ మహిళలకు ద్రోహం చేసిన వ్యక్తి కేసీఆర్ అని అన్నారు. మహిళనని కూడా చూడకుండా నా పై నోటికొచ్చినట్లు మాట్లాడతావా అని నిప్పులు చెరిగారు.తనపై విమర్శలు ,అదిశక్తిపై విమర్శలు చేయడమే నని చెప్పారు.”శక్తి తో పెట్టుకోకు .. తస్మాత్తు జాగ్రత్త .. జోగులాంబ తల్లి నీ సంగతి చూస్తుంది.జోగులాంబ తల్లి ఆగ్రహానికి నీవు బలికాక తప్పదు .. నీవు మాది మశికాక తప్పదు.
జోగులాంబ ఆశీర్వాదంతో నీకు శాపం పెడుతున్నా. టీఆర్ఎస్ తెలంగాణ ద్రోహుల పార్టీ .. దొంగల పార్టీ. టిఆర్ఎస్ నా కొడుకులు యువకుల ప్రాణాలతో చెలగాటం ఆడారు.బఠాణీలు అమ్ముకునేంత మంది కాంగ్రెస్ మీటింగ్ లకు జనం రాలేదంటున్నావు.మరి నీకెందుకు అంత భయం.నీలాగా నియోజకవర్గానికి కోట్లు ఖర్చుపెట్టలేదు మేము.కేసీఆర్ ఖబర్దార్ .. మహిళా లోకం నిన్ను తరిమికొట్టే దగ్గరపడింది.హంద్రీనీవా కు నేను మంగలహారతి పట్టిన వీడియో,ఫోటోనో చూపు.కేసీఆర్ .. ఓ దగాకోరు .. నీ బతుకు నాపై విమర్శలు చేసే స్థాయి నీకుందా.రాజకీయాల కోసం రోజుకో పార్టీ మారిన చరిత్ర కేసీఆర్ ది.
నా చరిత్ర బయట పడతానన్నావు .. నాలుగేళ్ళ పాలనలో ఏం చేసినవు.మాయల ఫకీరు వేషం వేసుకొని ప్రజల మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు.కేసీఆర్ ది నీచ సంస్కృతి .. నీవు బయపెడితే భయపడను.ఒక్క అడుగు కూడా వెనక్కు వేయను .. ఇంకా పది అడుగులు ముందుకే.మళ్లీ కేసీఆర్ కు అధికారం కల్ల.కేసీఆర్ ఖబర్దార్ .. నీవు నోరు అదుపులో పెట్టుకో.కేసీఆర్ బీజేపీ కి రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నాడు.బాబు కాళ్ళు మొక్కి ఏడు మండలాలను తీసుకుళ్లాడని చెబుతున్నావు.నీవు ఎందుకు కాళ్ళు మొక్కి ఆపలేక.పోయావు.దుబాయి బ్రోకర్ల చరిత్ర కేసీఆర్ ది .. నా చరిత్ర నీవు ఏం బయట పెడతావు” అంటూ అరుణ తీవ్రంగా విమర్శించారు.