” కెసిఆర్ ను వణికిస్తున్న ఓటమి” – ఏఐసిసి కార్యదర్శి మధుయాష్కీ .

హైదరాబాద్;

కేసీఆర్ ఓ అసమర్ధుడని ఓటమి భయం ఆయనను వెంటాడుతున్నదని ఏఐసిసి కార్యదర్శి మధుయాష్కీ అన్నారు.బుధవారం రాత్రి మీడియాతో ఆయన మాట్లాడారు. ముందస్తు ఎన్నికలు కేసీఆర్ కు భస్మాసురు హస్తమేనన్నారు. నిజామాబాద్ సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. సచివాలయం కు రాకుండా బులెట్ ప్రూఫ్ బాత్ రూమ్ లు కట్టుకున్న కేసీఆర్ తమపై విమర్శలు చేసే హక్కు లేదని మధుయాష్కీ మండిపడ్డారు. కేటీఆర్ ఆంధ్ర కాంట్రాక్టర్ లతో కలిసి తిరుగుతున్నాడని ఆరోపించారు. అమరావతి లో కేసీఆర్ బాబుకు వంగిసలామ్ కొట్టింది నిజం కాదా.? అని ప్రశ్నించారు.

చంద్రబాబుతో రొయ్యల పులుసు తిన్నప్పుడు గుర్తు రాలేదా .? అని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి అంటే ‘రావు’ల అభివృద్ధి మాత్రమేనాని మధుయాష్కీ విమర్శించారు. తెలంగాణా ఆత్మగౌరం అంటున్న కెసిఆర్ ..కొడుకికి ఎన్టీఆర్ పేరు ఎందుకు పెట్టుకున్నారని ప్రశ్నించారు. ?టీఆరెస్ నేతలు అడ్డగోలుగా దోచుకుంటున్నారని ఆరోపించారు. దళితులకు మూడెకరాల భూమి ఇవ్వకుండా, దళితులకు సీఎం చేయకుండా ఆంధ్రావాళ్ళు అడ్డుకున్నారా అని మధుయాష్కీ ప్రశ్నించారు. కాపలా కుక్కలాగా ఉంటానన్న కేసీఆర్ నేడు కాటేసే నక్కలా మారాడని విమర్శించారు. ”కేసీఆర్ నీవు సీఎం గాఉండి ఏడుమండలాలు ఎందుకు అడ్డుకోలేకపోయావు .?కేసీఆర్ కు భవంతుల కు జాగా దొరుకుతది ..పేదల ఇండ్లకు దొరకదా కేసీఆర్ ..?దేశం కోసం పనిచేసిన చరిత్ర ఉత్తమ్ ది. కేసీఆర్ నీది ..దుబాయ్ మామ బతుకు. తెలంగాణ భవిష్యత్ కోసం ఏర్పడే వేదికనే మహాకూటమి. తెలంగాణ కోసం నేను పనిచేసినప్పుడు ..కేసీఆర్ ఫామ్ హౌస్ లో పడుకున్నాడుమహాకూటమి చూసి కెసిఆర్ కు భయపట్టుకుంది. ఓటమి కెసిఆర్ ను వణికిస్తోంది. ఈ కూటమి కేసీఆర్ ను రాజకీయ బొంద పెట్టడం ఖాయం. మోడీకి కేసీఆర్ గులాం గా మారాడు. ప్రగతి భవన్ లోకి ఒక్క దళితున్ని రానివ్వని నువ్వా దళితుల గురించి మాట్లాడేది!కేసీఆర్ వి బైరుపు ,బట్టేబాజీ మాటలు .

కేసీఆర్ ..నాఇంట్లి చుట్టూ ఎన్నిసార్లు తిరిగావో మరిచిపోయావా .?ఈ ఎన్నికలు దొర గడి పాలనకు ..ప్రజలకు మధ్య జరుగుతున్నవి బాబ్లీ మీద పోరాడింది నేను. టిడిపి ,,కేసీఆర్ కాదు. కేసీఆర్ కు సంస్కారం లేదు. నాలుగేళ్లలో కేసీఆర్ చేసిన వేల కోట్ల దోపిడీని కక్కిస్తాం. కేసీఆర్ కు చంద్రబాబు ను చూస్తే లాగు తడుస్తుంది. బాబుకు వంగి వంగి సలాం లు కొట్టింది నిజం కదా .?డైవర్షన్ ట్యాక్టీస్ లో భాగంగానే కేసీఆర్ ..టీడీపీ ,కాంగ్రెస్ ల పొత్తు లపై మాట్లాడుతున్నారు. బెంగళూరులో ఆంధ్ర వ్యక్తితో కేటీఆర్ రియలెస్టేట్ వ్యాపారం చేస్తుంది నిజం కాదా .?ఉద్యమ కాలంలో పదిలక్షల ఆస్తిలేని కేసీఆర్ కుటుంబం ఇప్పుడెలా వేల కోట్ల కు పడగలెత్తారు .?

కేసీఆర్ ది గడీల భాష ..మధుయాష్కీ మాట్లాడుతుంది బడుగుల భాష. జాగృతి పేరుతో కవిత చేసిన వసూల్లేటి .? రైతులు చావులు లేవని కేసీఆర్ చెబుతుండగా రైతులు చనిపోతున్నారని కూతురు కవిత చెబుతున్నది. పాత డేట్లతో ప్రొసిడింగ్ ఇస్తున్నారు ..ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘనే ..కలెక్టర్లు జాగ్రత్త! టీఆరెస్ కు మద్దతిస్తే అధికారులు జైలుకెళ్లడం ఖాయం” అని ఏ ఐ సిసి కార్యదర్శి మధు అన్నారు.