కెసిఆర్ పాలనపై రాష్ట్రపతికి ఫిర్యాదు. ఖమ్మం, ఆలంపూర్లలో సభలు.

కోర్టు తీర్పు పాటించని కెసిఆర్ సి.ఎం గా కొనసాగే హక్కు లేదు.

 -జానారెడ్డి,ఉత్తమ్.

హైదరాబాద్;
తెలంగాణ వస్తే మా జీవితాలు బాగుపడతాయని ప్రజలు భావించారనికేసీఆర్ ప్రజల ఆశలను వమ్ము చేశారనిటిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ అన్నారు. శుక్రవారంసిఎల్పీ సమావేశం తర్వాతా మీడియాతోమాట్లాడారు. అణచివేత ధోరణితో కేసీఆర్ పాలన సాగుతోందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై అందుబాటులో ఉన్న నేతలతో చర్చించామణి ఆయన తెలిపారు. ఎమ్మెల్యేల సభ్యత్వరద్దు పై కేసీఆర్ సర్కార్ అప్రజాస్వామికంగా వ్యవహరించిందన్నారు. కోర్ట్ తీర్పు అమలు లో ప్రభుత్వం,స్పీకర్ పట్టించుకోకపోవడం సరికాదనివిమర్శించారు. గవర్నర్ ప్రసంగంలో అన్ని అబద్దాలు చెబుతుంటే  నిరసన తెలిపామన్నారు. తమ నిరసనలో మండలి చైర్మన్ కు గాయమైనదని లేనిపోని ఆరోపణలు చేస్తూ,ఆ ఇద్దరు ఎమ్మెల్యేల సభ్యత్వరద్దు చేశారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కోర్ట్ దాన్ని తప్పుపడుతూ ఎమ్మెల్యేల సభ్యత్వాలు పునరుద్ధరించాలని తీర్పు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. కోర్ట్ధిక్కరణ కింద మళ్ళీ కోర్ట్ కు వెళతామని ఆయన తెలిపారు. కేసీఆర్ పాలనలో కోర్ట్ తీర్పులకు  గౌరవం లేదని విమర్శించారు. కోర్ట్ తీర్పు ను గౌరవించని కేసీఆర్ సీఎం పదవిలో కొనసాగే నైతిక హక్కు  లేదన్నారు.స్పీకర్ ను సమయం ఆడిగామని, ఈనెల 11  న తమకు  సమయం ఇచ్చారని తెలిపారు. జానారెడ్డి నేతృత్వంలో స్పీకర్ ను కలుస్తామనితెలిపారు. అనంతరం ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ని కలిస్తామని చెప్పారు. రాష్ట్రపతి ని కూడా కలిసి జరుగుతున్న అప్రజాస్వామిక చర్యలను వివరిస్తామణి ఉత్తమ్ తెలియజేశారు.ఖమ్మం,అలంపూర్ లలో సభలు  జరుపుతామని,అనంతరం24 గంటల నిరాహార దీక్ష చేపడతామని అన్నారు.
కేసీఆర్ నిరంకుశ చర్యలపై కరపత్రాన్ని ముద్రించి రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేస్తాంఅని తెలిపారు. ఎమ్మెల్యేల మూకుమ్మడి రాజీనామాలపై సీఎల్పీ లో చర్చించలేదని జానా రెడ్డి తెలిపారు.ఆ చర్చ జరిగినప్పుడు మీడియాకు వివరిస్తామని ఆయన అన్నారు.