కేటీఆర్​ కృషితో ఇల్లు చేరిన గల్ఫ్​ బాధితురాలు. లావణ్యకు ఉద్యోగానికి కేటీఆర్​ హమీ!!!

Hyderabad:

సౌదిలో అష్టకష్టాలు పడి ఇల్లు చేరిన లావణ్య
లావణ్య కుటుంబాన్ని ఆదుకుంటానని కేటీఆర్ హమీ…లావణ్యకు సిరిసిల్లలో ఉద్యోగం, కేటీఆర్ ప్రకటన..ఆరు నెలలు సౌదిలో లావణ్య నరక యాతన..ఎట్టకేలకు.. తల్లిదండ్రుల చెంతకు లావణ్య..రాజన్నసిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం అడవి పదిర గ్రామానికి చెందిన లావణ్య ఆరు నెలల క్రితం ఉపాధి నిమిత్తం సౌది దేశం వెళ్లి.. ఓ కపిల్ ఇంట్లో పనికి కుదిరింది.కానీ ఆ కపిల్ రోజుకు 18 గంటల పాటు పనిభారం చెప్పడంతో పాటు తన ఇంట్లో..తన బంధువుల ఇంట్లో పని చేయిస్తూ..సరిగా తిండి పెట్టకుండా..జీతం అడిగిన పాపానికి..శారీరక హింస పెడుతూ.. నానా ఇబ్బందుకు గురి చేశాడు. ఈ విషయాన్ని బాధితురాలు వాట్సప్ లో కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లగా.. దానికి స్పందించి సంబంధిత అధికారులకు ట్విట్ చేశారు. దీంతో భారత ప్రభుత్వం- సౌదీ ఎంబసీ అధికారులు స్పందించి కపిల్ పై కేసు వేసినా కొంతమంది అధికారుల నిర్లక్ష్యంతో ఆలస్యమైనా… ఖతర్ దేశంలో ఉన్న ఎన్ఆర్ఐ .. తెలంగాణ జాగృతి సభ్యులు వికృతి రాజుగౌడ్ రూ.35 వేల ఆర్థిక సాయంతో ..సౌదిలో ఉన్న సామాజిక సేవా కార్యకర్త శివాజీ దంపతుల చేయూతతో ఎట్టకేలకు మంగళవారం రాత్రి బాధితురాలు లావణ్యను ఇండియాకు వచ్చే విధంగా చర్యలు తీసుకున్నారు.
Attachments area