కేటీఆర్ కు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ఆహ్వానం.

 

హైదరాబాద్:
మంత్రి కేటీఆర్‌కు మరోసారి వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ నుంచి ఆహ్వానం అందింది. 2019 జనవరి 22 నుంచి 25 వరకు స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరిగే ఈ సమావేశానికి ప్రత్యేక అతిథిగా హాజరు కావాలని వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ కు ఆహ్వానం పంపించారు. సాధారణంగా ప్రభుత్వంలోని ముఖ్యమంత్రులకు కేంద్ర మంత్రులకు మాత్రమే వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆహ్వానం లభిస్తుంది. గత ఏడాది మంత్రి కేటీఆర్కు ప్రత్యేక ఆహ్వానం పంపినందున ఆయన గత సమావేశాల్లో పాల్గొన్నారు.