“కేటీఆర్ నా హీరో’. అన్నకు చెల్లెలు కితాబు.

నిజామాబాద్:
“మా అన్న కేటీఆర్ నా హీరో నాకు ఇన్స్పిరేషన్” అని ఎం.పి. కవిత ప్రకటించారు.తాము రాబోయే ఎన్నికల కోసం కాకుండా, next జనరేషన్ కోసం పని చేస్తున్నట్టు ఆమె చెప్పారు. నిజామాబాద్ విద్యార్థులభవిష్యత్ కోసం నిజామాబాద్ ‘ఐటీ హబ్’ ఏర్పాటు చేసినట్టు కవిత తెలిపారు.
ఉద్యోగాలు స్థానికంగానే లభించేందుకు ఈ ఐటీ హబ్ దోహదం చేస్తుందన్నారు.వాట్సాప్ లాంటి ఆవిష్కరణలు పుట్టింది సామాన్యుల మది నుంచే నని ఎం.పి. తెలిపారు.నిజామాబాద్ ఐటీ హబ్ లో ‘వాట్సాప్’ లాంటి ఆవిష్కరణలు కచ్చితంగా వస్తాయన్నారు.ఐటీ హబ్ లో టాస్క్ అనే ప్రోగ్రామ్ తో విద్యార్థులకు మార్గదర్శనం లభిస్తుందన్నారు.ఐటీ హబ్ లో భాగస్వామ్యం అవుతున్న nri లకు కృతజ్ఞతలు తెలిపారు.
రూరల్ offshore బీపీఓ త్వరలో నిజామాబాద్ కు రాబోతోందని ఎం.పి చెప్పారు.ఈ నెల 30 న ప్రారంభోత్సవానికి రావాలని రామన్నను ఆమే ఆహ్వానించారు.నిజామాబాద్ లో ప్రత్యేకంగా మహిళల కోసం ప్రత్యేకంగా స్టేడియం నిర్మిస్తున్నామని కవిత తెలిపారు. నిజామాబాద్ కు 25 కోట్ల రూపాయల తో ప్రత్యేక బస్ టెర్మినల్ ఏర్పాటు చేస్తామని పార్లమెంట్ సభ్యురాలు చెప్పారు.డిజిటల్ లైబ్రరీ స్థాయి పెంచుతామని, తెలంగాణ వచ్చాక ప్రజలే కేంద్ర బిందువుగా పాలన నడుస్తోందన్నారు.భాగస్వామ్య ప్రజాస్వామ్యాన్ని అందరూ అలవర్చుకోవాలని ఆమె కోరారు.నిజామాబాద్ లో అన్ని కళాశాలలు విద్యార్థుల సంఖ్య ఎంతో అన్ని మొక్కలు నాటాలని కోరారు.