కేటీఆర్ ముందు చూపుతోనే ఖమ్మం అభివృద్ధి – స్పీకర్ చారి ప్రశంస.

ఖమ్మం:
ఖమ్మం అభివృద్ధి కి స్పీకర్ మధుసూదనా చారి ఫిధా అయ్యారు. రోడ్ల విస్తరణ, కొత్త ట్యాంక్ బండ్ అందాలు చూస్తూ స్పీకర్ ఆశ్చర్యపోయారు. ఎమ్మెల్యే అజయ్ తో కలిసి లకారంలో బోటు షికారు చేశారు.
లకారం పై హరితహారం లో పాల్గొని మొక్కలు నాటిన స్పీకర్ మదుసూదనా చారి, ఎమ్మెల్యే అజయ్ కుమార్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మి నారాయణ. ఒకప్పటి ఖమ్మం కంటే నేటి ఖమ్మం బాగా అభివృద్ధి చెందిందని స్పీకర్ అన్నారు.
ఎబ్బై యెండ్ల లో జరగని అభివృద్ధి జరిగిందన్నారు. కష్టపడి పనిచేసే ఇలాంటి నాయకత్వం ఉండటం ఖమ్మం ప్రజల అదృష్టం అని ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కు కితాబిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ఖర్చు చేసి అభివృద్ధి చేస్తుందన్నారు. కెటీఆర్ ముందు చూపు ఖమ్మం అభివృద్ధి కి కారణం అని ప్రశంసించారు. మొక్కలు నాటడం లో నాడు అశోకుడు, నేడు మన సీఎం కేసీఆర్ అన్నారు.
అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో తెలంగాణ రాష్ట్రం దూసుకుపోతున్నట్టు శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి చెప్పారు.