కేశవరావు జాదవ్ ఇక లేరు.

హైదరాబాద్;
పౌరహక్కులనాయకుడు,తెలంగాణఉద్యమ నేత కేశవరావు జాదవ్(85) కన్ను మూశారు. తొలి తెలంగాణ ఉద్యమంలో జాదవ్ 17 సార్లు అరెస్టు అయి, దాదాపు రెండేళ్లు జైలు జీవితం గడిపారు. తెలంగాణ సాయుధ పోరాటం, నాన్‌ముల్కీ గో బ్యాక్ ఉద్యమం, జై తెలంగాణ పోరాటం, తెలంగాణ ఉద్యమ మలి దశ పోరాటాల్లో కేశవరావ్ జాదవ్ క్రీయాశీల పాత్ర పోషించారు. తెలంగాణ జన పరిషత్‌కు కన్వీనర్‌గా పనిచేశారు. మానవ హక్కుల ఉద్యమాలు, ప్రాంతీయ ఉద్యమాలు, వామపక్ష ఉద్యమాలు, మహిళా ఉద్యమాలు, కుల ఉద్యమాలు, నక్సలైటు పోరాటాలలో జాదవ్ గొంతువినిపించేది.అణగారిన వర్గాల జన గొంతుకగా ఆయనకుప్రత్యెక గుర్తింపు ఉన్నది.హైదరాబాద్‌లోని హుస్సేని ఆలంలో 1933 జనవరి 27వ తేదీన కేశవరావ్ జాదవ్ జన్మించారు. ప్రొఫెసర్ జయశంకర్, కేశవరావ్ జాదవ్ ఆధ్వర్యంలో విడివిడిగా పనిచేస్తున్న 28 సంఘాలు 1997 లో‘తెలంగాణ ఐక్య వేదిక’గా ఏర్పడ్డాయి. కేశవరావు జాదవ్ లోహియా అనుచరుడని,జీవితమంతాసోషలిస్టుగా గడిపారని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాంఅన్నారు. కేశవరావు జాదవ్ మృతి పూడ్చలేనిదని,ఆయన గొప్ప మానవతావాది అని ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి ఒకప్రకటనలో సంతాపం తెలిపారు.