కేసిఆర్ సోదరి మృతి.

హైదరాబాద్:
ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగవ సోదరి చీటి లీలమ్మ సోమవారం మరణించారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న లీలమ్మ సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు హుటాహుటిన యశోదా ఆస్పత్రికి చేరుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామంలో లీలమ్మ నివసిస్తున్నట్టు టీఆరెస్ వర్గాలు తెలిపాయి.