కేసీఆర్,జగన్ లకు సోనియా ఆహ్వానం. 23 న యుపీఏ సమావేశం.


hyderabad:

ఈ నెల 23 న ఢిల్లీలో తలపెట్టిన బీజేపీ వ్యతిరేక పార్టీల సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ ప్రతిపక్ష నాయకుడు జగన్ హాజరవుతారా లేదా అన్న అంశంపై చర్చ సాగుతున్నది. నరేంద్రమోడీ నాయకత్వంలోని ఎన్డీయే మరోసారి అధికారంలోనికి రాకుండా నిలువరించేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలలో భాగంగా విపక్షాలతో ఈ నెల 23న భేటీ నిర్వహించనుంది. ఈ భేటీకి యూపీఏ భాగస్వామ్య పార్టీలతో పాటు, తటస్థ పార్టీలకు కూడా ఆహ్వానాలు పంపిస్తున్నది. అందులో భాగంగానే టిఆర్ఎస్ అధినేత కేసీఆర్, వైసీపీ అధినేత జగన్ లకు ఆహ్వానం అందింది. యూపీఏ చైర్ పర్సన్ హోదాలో సోనియా గాంధీ నుంచి వీరికి ఆహ్వానాలు అందాయి.